పవన్‌కళ్యాణ్‌ చుట్టూ మాఫియా చేరింది!

పవన్‌కళ్యాణ్‌ చుట్టూ మాఫియా చేరింది!

''పవన్‌కళ్యాణ్‌ చుట్టూ మాఫియా చేరిందండీ. ఆయనకి తెలియడం లేదు ఆ సంగతి'' ఈ మాటలు అన్నది 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పంపిణీదారుడు సంపత్‌ కుమార్‌. సర్దార్‌ చిత్రాన్ని కృష్ణా జిల్లాకి పంపిణీ చేసిన సంపత్‌కి ఇప్పుడు 'కాటమరాయుడు' డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ ఇవ్వడం లేదట.

నాలుగు కోట్ల ముప్పయ్‌ ఎనిమిది లక్షలకి కొంటే ఆ చిత్రంపై తనకి కోటీ ఎనభై లక్షలు నష్టం వచ్చిందని, అప్పుడే వాళ్లని కలిస్తే ''పవన్‌కళ్యాణ్‌ మీ కోసమే ఇంకో సినిమా చేస్తున్నారు. ఏమీ బెంగ పడవద్దు'' అని చెప్తే, ఏడాది ఎదురు చూసానని, కానీ ఇప్పుడు మాట తప్పారని సంపత్‌ ఆరోపించాడు.

నష్టపోయిన వారి కోసం పవన్‌ సినిమా చేస్తుంటే, పవన్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, నిర్మాత శరత్‌ మరార్‌ మాత్రం తమకి కావాల్సిన వారికి రైట్స్‌ అమ్మేస్తున్నారని, ఇది పవన్‌ దృష్టికి తీసుకెళ్లడానికే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టానని సంపత్‌ చెప్పాడు. తాను అప్పట్లో మాట్లాడుకున్న దాంట్లో మూడు శాతం కట్టలేకపోయానని, అది సాకుగా చూపించి ''నీ దగ్గర డబ్బుల్లేవ్‌. ఎలా కడతావ్‌'' అని అడుగుతున్నారని, చాంబర్‌ వాళ్లతో ఫోన్‌ చేయిస్తే శ్రీనివాస్‌ తనని బూతులు తిడుతున్నాడని సంపత్‌ ఆరోపించాడు.

తనని ఏదైనా చేస్తామని బెదిరిస్తున్నారని, ప్రెస్‌మీట్‌ పెడితే పరువు నష్టం దావా వేస్తామంటున్నారని, తన వెనుక ఏం జరుగుతున్నదో పవన్‌కి తెలియడానికే తాను మీడియా ముందుకి వచ్చానని, తనకి పవన్‌ అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని సంపత్‌ చెప్పాడు. తనతో పాటు నైజాం, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లకి కూడా కాటమరాయుడు రైట్స్‌ ఇవ్వలేదని, నైజాం పంపిణీదారుడు సర్దార్‌పై ఎనిమిది కోట్లు నష్టపోయాడని సంపత్‌ తెలియజేసాడు. పబ్లిగ్గా ఇన్ని ఆరోపణలు చేసిన డిస్ట్రిబ్యూటర్‌కి శరత్‌ మరార్‌ అండ్‌ టీమ్‌ ఏమి సమాధానిమిస్తుందనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు