మహేష్ టైటిల్.. పీవీపీ కన్ఫమ్ చేశాడు

మహేష్ టైటిల్.. పీవీపీ కన్ఫమ్ చేశాడు

‘బ్రహ్మోత్సవం’ సినిమా దెబ్బకు మహేష్ బాబు, పొట్లూరి వరప్రసాద్ మధ్య సంబంధాలు బాగా దెబ్బ తినేసినట్లు వార్తలొచ్చాయి. ‘బ్రహ్మోత్సవం’ నష్టాల్ని కవర్ చేయడం కోసం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తానన్న సినిమా విషయంలో మహేష్ హ్యాండిచ్చేయడం పీవీపీని బాధించిందంటారు. మహేష్ మీద కోపాన్నే వంశీ పైడిపల్లి మీద పీవీపీ చూపించినట్లుగా అప్పట్లో గుగుసలాడుకుకున్నారంతా. దీనికి సంబంధించిన వివాదం ఎన్ని మలుపులు తిరిగిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘విన్నర్’ వేడుకలో పీవీపీ.. మహేష్ కొత్త సినిమా గురించి మాట్లాడటం.. ఆ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయడం ఆసక్తి రేకెత్తించింది.

‘విన్నర్’ నిర్మాతల్లో ఒకడైన ఠాగూర్ మధు గురించి పీవీపీ మాట్లాడుతూ.. ఈ ఏడాది మధు ‘మిస్టర్’, ‘విన్నర్’లతో పాటు ‘సంభవామి’ లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడని పీవీపీ పేర్కొన్నాడు. ఈ మూడు సినిమాలపైనా భారీ అంచనాలున్నాయని.. ఇవి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని పీవీపీ అన్నాడు. ‘సంభవామి’ అనే టైటిల్ గురించి ఇప్పటిదాకా అధికారిక సమాచారం ఏదీ లేదు. ఈ టైటిల్ ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్నప్పటికీ ఆ చిత్ర యూనిట్ సభ్యులెవరూ కన్ఫమ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాతల్లో ఒకడైన ఠాగూర్ మధు సమక్షంలోనే ‘సంభవామి’ టైటిల్ కన్ఫమ్ అయిపోయినట్లు మాట్లాడాడు పీవీపీ. ఠాగూర్ మధు తనకు చాలా క్లోజ్ అని కూడా పీపీవీ చెప్పడాన్ని బట్టి ఇది అఫీషియల్ టైటిలే కావచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English