అల్లు అర్జున్‌ లుక్కు చూసి మోసపోండి

అల్లు అర్జున్‌ లుక్కు చూసి మోసపోండి

'దువ్వాడ జగన్నాథమ్‌'గా అల్లు అర్జున్‌ని బ్రాహ్మడి గెటప్‌లో సరికొత్తగా ప్రెజెంట్‌ చేస్తోన్న హరీష్‌ శంకర్‌ దీనిని ఫక్తు కామెడీ సినిమాగా ప్రచారం చేస్తున్నాడు. కానీ ఈ చిత్రంలో చాలా సర్‌ప్రైజ్‌లు వుంటాయని, కామెడీగా కనిపిస్తూనే సడన్‌గా వయొలెంట్‌గా మారి అల్లు అర్జున్‌ తన పవర్‌ఫుల్‌ యాంగిల్‌తో పాటు స్టయిలిష్‌ కోణాన్ని కూడా చూపిస్తాడని, పర్‌ఫెక్ట్‌ కమర్షియల్‌ ఫార్ములాతో, పొట్ట చెక్కలయ్యే కామెడీతో హరీష్‌ శంకర్‌ ఈ కథని చాలా బాగా మలిచాడని ఇన్‌సైడర్స్‌ రిపోర్ట్‌.

గబ్బర్‌సింగ్‌ చిత్రం తర్వాత హరీష్‌ శంకర్‌ ఆ రేంజ్‌లో కదం తొక్కిన సినిమా ఇదేనట. అల్లు అర్జున్‌తో బ్రాహ్మడి గెటప్‌లో చేయించిన కామెడీ అలరిస్తే, అదే సమయంలో సెకండ్‌ హాఫ్‌లో చూపించే హీరోయిజం పీక్స్‌లో వుంటుందట. సమ్మర్‌కి ఎన్ని పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతున్నా కానీ నిర్మాత దిల్‌ రాజుకి ఏ చీకు, చింత లేదంటే కారణం ఇదేనట.

శతమానం భవతి, నేను లోకల్‌ ఎలాగైతే మినిమం గ్యారెంటీ సబ్జెక్టులో ఇది కూడా అలాంటి గ్యారెంటీ సినిమా అని, గురి తప్పే అవకాశమే లేదని దిల్‌ రాజు చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడట. బాహుబలి, సంభవామి, కాటమరాయుడు చిత్రాలు ఎప్పుడొచ్చేదీ, ఎలా ఆడేదీ కూడా దిల్‌ రాజు ఆలోచించడం లేదని, మే నెల రెండవ వారంలో 'దువ్వాడ జగన్నాథమ్‌' రిలీజ్‌ ఖాయమని బయ్యర్లకి స్పష్టం చేసాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు