అనసూయని అలా పడేసారంట

అనసూయని అలా పడేసారంట

ఐటెమ్‌ సాంగ్సే చేయనంటూ భీష్మించుకున్న అనసూయ అప్పట్లో 'అత్తారింటికి దారేది'లో ఓరి దేవుడో దేవుడో పాట చేయడానికి కూడా ససేమీరా అనేసింది. మరి 'విన్నర్‌' సినిమాలో సాంగ్‌ ఎందుకు చేసిందో తెలుసా? ఐటెమ్‌ సాంగ్‌ అంటూ ఆఫర్‌ ఇస్తే అనసూయ తప్పించుకుని తిరిగిందట. తాను ఈ పాట చేయగలనా, మెప్పించగలనా అంటూ దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో అనేదట.

అయితే ఒకసారి పాట లిరిక్స్‌ చూడమంటూ ఆ పేపర్‌ చేతిలో పెట్టారట. 'బర్గర్‌ బుగ్గల బ్యూటీ శాంపిల్స్‌ కుళ్లుకుంటాయంట సిమ్లా యాపిల్స్‌' లాంటి లైన్స్‌ చూసి అనసూయ ఫ్లాట్‌ అయిపోయిందట. ఈ పాట చేస్తున్నానంటే అప్పటికప్పుడు కమిట్‌ అయిపోయిందట. అమ్మాయిలు పొగడ్తలకి పడిపోతారని, తన అందాన్ని అలా పొగుడుతూ పాట రాస్తే కాదని ఎలా చెప్తానని అనసూయ అడుగుతోంది.

ఇకపోతే ఐటెమ్‌ పాటలంటూ వాటిని చీప్‌గా చూడవద్దని, స్పెషల్‌ సాంగ్‌ అనండని అంటోంది. ఐటెమ్‌ అంటే వస్తువు అని, తామేమీ వస్తువులం కాదని ఘాటుగా చెప్పింది. ఇకమీదట ఇలాంటి పాటలు కంటిన్యూ చేస్తావా అని అడిగితే ఈ పాటకి వచ్చే స్పందనని బట్టి, వచ్చిన ఆఫర్‌ని బట్టి డిసైడ్‌ చేసుకుంటానంది.  కేవలం అనసూయ డాన్స్‌ చేస్తే సరిపోదని ఈ పాట మరో యాంకర్‌ సుమతో పాడించిన సంగతి తెలిసిందే. బాత్రూమ్‌ సింగర్‌కి ప్రమోషన్‌ ఇచ్చారంటూ తమన్‌కి సుమ కృతజ్ఞతలు చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు