హేట్సాఫ్‌ టు పివిపి సినిమాస్‌

హేట్సాఫ్‌ టు పివిపి సినిమాస్‌

ప్రసాద్‌ వి. పొట్లూరి... ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మార్మోగిపోతున్న పేరిది. యువ దర్శకులకి ఆయనొక గేట్‌ వేలా కనిపిస్తున్నాడు. అభిరుచిగల చిత్రాలు నిర్మిస్తూ, కొత్త రకం కథలని, ఐడియాలని ఎంకరేజ్‌ చేస్తున్నాడు. ఒకవైపు భారీ బడ్జెట్‌ చిత్రాలు తీస్తూనే మరోవైపు చిన్న చిత్రాలని కూడా నిర్మిస్తూ బిజీ ప్రొడక్షన్‌ హౌస్‌గా నిలబెట్టాడు.

ఆయన ఎంచుకుంటోన్న కథలు, సెట్‌ చేసుకుంటోన్న కాంబినేషన్లు ఒక్కోసారి బెడిసికొడుతున్నా, ఆ ప్రయత్నంలో ఆయనకి కోట్ల రూపాయల నష్టం వస్తున్నా కానీ పివిపి వెనుకంజ వేయడం లేదు. వర్ణ, బ్రహ్మోత్సవం, సైజ్‌ జీరో లాంటి భారీ పరాజయాలు తగిలితే ఏ నిర్మాత అయినా ఇక రిస్కు చేయడానికి సాహసించడు. కానీ పివిపి మాత్రం అవన్నీ తన ప్రయాణంలో భాగమని అనుకుంటున్నాడు. అందుకే ఆయన నుంచి క్షణం, ఊపిరిలాంటి అద్భుతమైన సినిమాలొచ్చాయి.

ఇప్పుడాయన నిర్మించిన 'ఘాజీ' అందరి ప్రశంసలు అందుకుంటూ విజయ పథంలో దూసుకెళుతోంది. ఇండస్ట్రీకి హిట్లతో పాటు మంచి దర్శకులని కూడా ఆయన అందిస్తున్నాడు. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కడంలో పివిపి లాంటి నిర్మాతలు చాలా అవసరం. అనుభవమున్న నిర్మాతలు కూడా తమ డబ్బు సేఫ్టీ చూసుకోవడం కోసం మూస చిత్రాలతోనే కాలం గడుపుతున్నారు. కానీ ప్రసాద్‌ వి. పొట్లూరి మాత్రం పాత పద్ధతులకి చెల్లు చీటీ అంటూ తెలుగు చిత్రానికి కొత్త నడకలు నేర్పిస్తున్నాడు. హేట్సాఫ్‌ టు పివిపి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు