అనసూయ ఇలా మాట మార్చేసిందేంటి?

అనసూయ ఇలా మాట మార్చేసిందేంటి?

ఒకప్పుడు యాంకర్లంటే యాంకర్లే. బుల్లితెరను దాటి బయటికి వచ్చేవాళ్లు కాదు. కానీ అనసూయ అరంగేట్రంతో కథ మారింది. యాంకరింగ్‌కు కూడా గ్లామర్ టచ్ ఇచ్చి.. సూపర్ పాపులారిటీ సంపాదించేసి సినిమా అవకాశాలు కూడా పట్టేసింది ఈ హాట్ బ్యూటీ.

ఆమెకు నాలుగేళ్ల కిందటే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి స్టెప్పులేసే అవకాశం లభించిందన్న సంగతి తెలిసిందే. ఆమె రేంజికి ఆ అవకాశాన్ని కళ్లకద్దుకుని మరో ఆలోచన లేకుండా ఆ పాట చేయాల్సింది. కానీ అనసూయ ఒప్పుకోలేదు. కారణమేంటి అని అడిగితే.. ఐటెం సాంగ్స్ చేయడం తనకిష్టం లేదని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమే స్పష్టంగా చెప్పింది.

కానీ ఇప్పుడు అనసూయ మాట మార్చేసింది. ‘విన్నర్’ సినిమాలో సూయ సూయ పాటలో సాయిధరమ్‌తో ఆడిపాడాక అనసూయ స్వరం మారింది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పాట చేయకపోవడానికి కారణం అది ఐటెం సాంగ్ అని కాదట. అప్పటికి ఆమె ప్రెగ్నెంట్ అట. అందుకే ఆ పాట చేయడానికి ఒప్పుకోలేదట. ‘‘పవన్ కళ్యాణ్‌తో పాటంటే ఎవరు ఒప్పుకోరు చెప్పండి. కానీ అప్పటికి నేను ప్రెగ్నెంట్.

సింపుల్ స్టెప్పులే అని.. ఏం పర్వాలేదని కూడా చెప్పారు. కానీ నేను చేయొద్దని అనుకున్నా’’ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది అనసూయ. మరి ఇదే అసలు వాస్తవం అయితే ఇంతకుముందు వేరే రీజన్ ఎందుకు చెప్పినట్లో? ‘విన్నర్’లో ఐటెం సాంగ్ చేశాక పవన్ సినిమాలో స్టెప్పులేయడానికి కారణం మారిపోవడం విడ్డూరమే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు