ఉపాసన టీవీలో ఏం చూసిందో తెలుసా?

ఉపాసన టీవీలో ఏం చూసిందో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి టీవీ అరంగేట్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ నెల 13వ తారీఖున చిరు బుల్లితెరలోకి అడుగుపెట్టేశాడు. ఆయన హోస్ట్ చేస్తున్ను ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో మొదలైపోయింది. ఆల్రెడీ మూడు ఎపిసోడ్లు అయిపోయాయి.

ఇప్పటిదాకా ఈ షోను నడిపించిన అక్కినేని నాగార్జునను తొలి సెలబ్రెటీ గెస్ట్‌గా పిలిచి.. ఎపిసోడ్‌ను రక్తి కట్టించాడు చిరు. మెగా అభిమానులంతా మూడు రోజులుగా పనిగట్టుకుని రాత్రి 9.30కి మాటీవీ ముందు కూలబడిపోతున్నారు. ఐతే చిరంజీవి కోడలు ఉపాసన మాత్రం అనుకోకుండానే తన మావయ్య ప్రోగ్రాం చూసిందట.

టీవీ రిమోట్ పట్టుకుని ఛానెళ్లు మారుస్తూ ఉండగా.. అనుకోకుండా టీవీలో చిరంజీవి కనిపించేశాడట. అది కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ అట. ఇక అలాగే టీవీకి అతుక్కుపోయి చూస్తూ ఉండిపోయిందట. తన మావయ్యను పొగడాలంటే మామూలుగా పొగడొచ్చుగా. అనుకోకుండా ఛానెల్ మారుస్తుంటే చిరు కనిపించాడనడం.. ఈ షో పేరు కూడా తెలియనట్లు ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తెలుగు వెర్షన్ అనడం.. విడ్డూరంగానే ఉంది.

ఎంతైనా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలోకి వెళ్లింది కదా.. కొంచెం నాటకీయత జోడించిందేమో ఉపాసన. ఇక చిరు వ్యాఖ్యానం విషయానికి వస్తే.. ఆయన బాగానే చేస్తున్నారు కానీ.. నాగార్జునలా సహజంగా కార్యక్రమాన్ని రక్తి కట్టించేట్లదన్న కామెంట్లు పడుతుున్నాయి. కొత్త కాబట్టి.. అనుభవం మీద చిరు కూడా సహజ శైలిలో ప్రోగ్రాం నడిపిస్తాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు