విడుద‌ల‌కు ముందే పైర‌సీ చేసి పెట్టేశారు

విడుద‌ల‌కు ముందే పైర‌సీ చేసి పెట్టేశారు

గ‌త వారం విడుద‌లైన సూర్య సినిమా ఎస్‌-3ని రిలీజ్ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కే అందుబాటులోకి తెస్తామంటూ త‌మిళ్ రాక‌ర్స్ అనే పైర‌సీ వెబ్ సైట్ అధికారికంగా అనౌన్స్ చేయ‌డం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. పైర‌సీ వెబ్ సైట్లు ఎంత‌గా బ‌రితెగించాయో చెప్ప‌డానికి ఇది రుజువు. ఆ వెబ్ సైట్ చేతికి త‌మ సినిమా దొర‌క్కుండా ఎస్‌-3 బృందం జాగ్ర‌త్త ప‌డింది. ఐతే ఇప్పుడు అదే వెబ్ సైట్ ఒక దారుణానికి ఒడిగ‌ట్టింది. లైట్ మ‌న్ అనే త‌మిళ సినిమాను విడుద‌ల క‌న్నా ముందే త‌మ వెబ్ సైట్లో పెట్టేసింది. ఈ సినిమా ఎలా వాళ్ల చేతికి చిక్కింద‌న్న‌ది అంతు బ‌ట్ట‌డం లేదు.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ సంద‌ర్భంగా యూనిట్ స‌భ్యులే ఎవ‌రో సినిమాను కాపీ చేసి పైర‌సీ వెబ్ సైట్‌కు అంద‌జేసిన‌ట్లు తెలుస్తోంది. ఎలాగైతేనేం ఆ సినిమా యూనిట్‌కు దారుణ‌మైన దెబ్బ త‌గిలింది. దీనిపై చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు.. న‌టీన‌టులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వెంక‌టేష్ కుమార్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ లైట్ మ‌న్ సినిమాను రూపొందించాడు. చాలామంది కొత్త న‌టీన‌టులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఇదొక ఆఫ్ బీట్ సినిమా. ఈ మ‌ధ్య రిలీజైన ట్రైల‌ర్ ఆస‌క్తి రేకెత్తించింది. ఎంతోక‌ష్ట‌ప‌డి.. ఖ‌ర్చు పెట్టి ఒక యువ బృందం చేసిన ఈ సినిమా ఇలా పైర‌సీ సైట్ బారిన ప‌డ‌టం విచార‌క‌రం. ఈ ప‌రిణామంపై త‌మిళ సినీ ప‌రిశ్ర‌మకు చెందిన చాలామంది మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా పైర‌సీ సైట్ల మీద ఉక్కుపాదం మోప‌క‌పోతే సినిమా భవిష్య‌త్తు మ‌రింత ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని  అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు