చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు

చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు

‘ప్రేమమ్’ సినిమాతో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్న అక్కినేని నాగచైతన్య ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో రెడీ అయిపోతున్నాడు. ఆల్రెడీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో ‘నిన్నే పెళ్లాడతా’ తరహా ఎంటర్టైనర్ చేస్తున్నాడు.

ఈ మధ్యే కృష్ణ అనే కొత్త దర్శకుడితో ఒక థ్రిల్లర్ మూవీ మొదలుపెట్టాడు. ఇంకా అతడి కోసం రెండు మూడు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇంతలో ఓ తమిళ దర్శకుడితో మల్టీ లాంగ్వేజ్ మూవీ చేయడానికి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. ‘ధృవంగల్ పదనారు’ అనే సెన్సేషనల్ థ్రిల్లర్ తీసిన కార్తీక్ నరే.

‘డి-16’ అనే షార్ట్ నేమ్‌తో పాపులర్ అయిన ఈ చిత్రం నెల రోజులుగా కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. తెలుగులో చాలా క్యారెక్టర్ రోల్స్ చేసిన రెహమాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఇది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన పెద్ద హిట్టయిందీ చిత్రం.

ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువాదం చేస్తున్నారు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న కార్తీక్ నరేన్.. తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేశాడు. అతనీ చిత్రాన్ని తమిళం.. మలయాళం.. తెలుగు భాషల్లో రూపొందించాలనుకుంటున్నాడు.

అందుకోసం ఈ మూడు భాషలకు చెందిన నటుల్ని ఎంచుకుంటున్నాడు. తమిళం నుంచి అరవింద్ స్వామి కీలక పాత్ర చేయనుండగా.. మలయాళం నుంచి ఓ స్టార్ హీరో ఇందులో నటిస్తాడట. ‘డి-16’ సినిమా చూసిన చైతూ.. మరో ఆలోచన లేకుండా కార్తీక్‌తో పని చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు