నాగార్జున ఉన్నాడని జాగ్రత్త

నాగార్జున ఉన్నాడని జాగ్రత్త

ఈవారంలో 'ఘాజీ' తప్ప ఇంకో సినిమా ఏదీ విడుదల కావడం లేదు. మొదట్లో ప్లాన్‌ చేసుకున్న ప్రకారమైతే 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'గుంటూరోడు' చిత్రాలు కూడా ఈ శుక్రవారమే విడుదల కావాల్సింది. కానీ గత వారం 'ఓం నమో వెంకటేశాయ', 'సింగం 3' రిలీజ్‌ వుండడంతో థియేటర్ల సమస్య వస్తుందని ఆ రెండు చిత్రాలని వాయిదా వేసారు.

తీరా చూస్తే 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాన్ని రెండవ వారం కొనసాగించలేని పరిస్థితి వుంది. 'సింగం 3'కేమో ఒక మోస్తరు వసూళ్లు మాత్రమే వస్తున్నాయి. 'ఘాజీ' చిత్రం ఏ సెంటర్స్‌లో మాత్రమే ఆడే అవకాశాలుండడంతో ఆ రెండూ రిలీజ్‌ చేసి వున్నా వాటికి థియేటర్లతో పాటు కలక్షన్లు కూడా వుండేవి.

ఈవారం సినిమాలు లేకపోవడంతో 'నేను లోకల్‌'కి కలిసి వస్తుంది. ఈ వీకెండ్‌తో ముప్పయ్‌ కోట్ల షేర్‌ దాటనున్న ఈ చిత్రం నాని మార్కెట్‌కి పెద్ద బూస్ట్‌ ఇచ్చింది. ఇదిలావుంటే సింగం 3, ఓం నమోకి బెదిరి మార్చి 3కి వెళ్లిన సినిమాలకి కొత్త సమస్య ఎదురు కానుంది. వచ్చేవారం విడుదలయ్యే విన్నర్‌, యమన్‌ చిత్రాలు కనుక మాస్‌ని ఆకట్టుకున్నట్టయితే తర్వాతి వారంలో వచ్చే చిత్రాలు ఇబ్బంది పడతాయి. ఈవారంలో దొరికిన స్పేస్‌ వదిలేసి బాక్సాఫీస్‌ బిజీగా వుండే వీకెండ్‌కి షిఫ్ట్‌ అయిన ఈ చిత్రాలకి ఎలాంటి ఫలితం వస్తుందనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు