మహేష్ టీజర్.. మామూలుగా కాదు

మహేష్ టీజర్.. మామూలుగా కాదు

తెలుగులో గత కొన్నేళ్లుగా ఏ కొత్త సినిమా సెట్స్ మీదికి వెళ్లినా సరే.. మూడు నాలుగు నెలల్లో టీజర్ బయటికి వచ్చేస్తోంది. ‘బాహుబలి’ లాంటి స్పెషల్ మూవీస్‌ను మినహాయిస్తే మామూలు సినిమాలకు సాధ్యమైనంత త్వరగా ఫస్ట్ లుక్.. టీజర్ లాంచ్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఐతే మహేష్ బాబు కొత్త సినిమా విషయంలో మాత్రం ఇలా జరగట్లేదు. ఇంత వరకు ఈ సినిమా టైటిలే ప్రకటించలేదు. ఇక ఫస్ట్ లుక్.. టీజర్ కోసం కూడా అభిమానుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఐతే తాజా సమచారం ప్రకారం మార్చిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్-మురుగదాస్ సినిమా టీజర్ బయటికి వస్తుందట.

మురుగదాస్ తన సినిమాల ఫస్ట్ లుక్.. టీజర్ లాంటి విషయాల్లో చాలా శ్రద్ధ చూపిస్తాడు. టీజర్‌తోనే గొప్ప ఇంపాక్ట్ వేయాలని చూస్తాడు. ఇంతకుముందు కత్తి.. తుపాకి లాంటి సినిమాల ట్రైలర్లు ఏ రేంజిలో పేలాయో తెలిసిందే. వీటి ట్రైలర్లు చూడగానే సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇప్పుడు మహేష్ సినిమా టీజర్ విషయంలోనూ అంతే శ్రద్ధ చూపిస్తున్నాడు మురుగదాస్. ఈ చిత్ర టీజర్ లండన్లో రెడీ అవుతుండటం విశేషం. అక్కడ వీఎఫ్ఎక్స్ నిపుణులతో కలిసి ఓ ప్రత్యేక బృందం టీజర్ తీర్చిదిద్దుతోందట. నిడివి తక్కువే అయినా ఇంపాక్ట్ గట్టిగా ఉండేలా ఈ టీజర్‌ను మలిచే ప్రయత్నంలో ఉన్నారట. కచ్చితంగా ఈ టీజర్ తెలుగు.. తమిళ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. టీజర్ లేటైనా లేటెస్టుగా ఉంటుందన్నది వారి మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English