దత్తు నెత్తిన మళ్లీ తెల్ల గుడ్డే

దత్తు నెత్తిన మళ్లీ తెల్ల గుడ్డే

సినీ నిర్మాణానికి దూరంగా వుంటోన్న సీనియర్‌ నిర్మాత చలసాని అశ్వనీదత్‌ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం కోసమని కొంతమంది హీరోల డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో అందరికంటే ముందున్నాడు మహేష్‌బాబు. అశ్వనీదత్‌తో సినిమా చేస్తానని మాట ఇచ్చి, అడ్వాన్స్‌ పుచ్చుకుని ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు మహేష్‌ ఆ మాట నిలబెట్టుకోలేదు. తనకి నచ్చే కథ తీసుకొచ్చినా లేదంటే ఎవరికీ కమిట్‌ కాని దర్శకుడు దొరికినా దత్తుకి సినిమా చేస్తానని మహేష్‌ మాట ఇచ్చాడు.

కానీ మహేష్‌కి నచ్చే కథని అశ్వనీదత్‌ పట్టుకెళ్లలేకపోయాడు. క్రిష్‌తో శివమ్‌ అని, పూరితో మరో సినిమా అని అనుకున్నారు కానీ కుదర్లేదు. దాంతో వంశీ పైడిపల్లి చిత్రానికి నిర్మాత ఖరారు కాకపోవడంతో మహేష్‌ ఆ చిత్రాన్ని అశ్వనీదత్‌కి చేద్దామని అన్నాడు. కానీ పైడిపల్లికి దిల్‌ రాజుతో కమిట్‌మెంట్‌ వుండడంతో ఇద్దరికీ కలిపి చేయాలని డిసైడ్‌ అయ్యారు. అసలు వీళ్లిద్దరూ తెర మీదకి వచ్చిందే వంశీ పైడిపల్లికీ, పివిపికి మధ్య గొడవ రావడం వల్ల.

కానీ ఇప్పుడా గొడవ సద్దుమణిగిపోయి వాళ్లిద్దరూ ఒక్కటైపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ ఇక దిల్‌ రాజు, అశ్వనీదత్‌ చేతిలో లేనట్టే. మళ్లీ నిరాశే ఎదురైన అశ్వనీదత్‌కి మళ్లీ మహేష్‌తో సినిమా కుదిరేదెప్పటికో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు