తెలుగు మీడియాపై తాప్సీ ఫైర్‌

తెలుగు మీడియాపై తాప్సీ ఫైర్‌

తెలుగు సినిమా మీడియాపై తాప్సీ మండిపడింది. తనకి కొన్ని ఫ్లాప్‌లు వచ్చేసరికి ఐరెన్‌లెగ్‌ అనే ముద్ర వేసారని, ఆత్మవిశ్వాసం కోల్పోయేలా కామెంట్‌ చేసారని తాప్సీ ఆరోపించింది. ఒక సినిమా పరాజయానికి హీరోయిన్‌ ఎలా కారణం అవుతుందని ప్రశ్నించింది.

తెలుగు సినిమాల్లో ఎన్నిట్లో హీరోయిన్‌కి ఇంపార్టెన్స్‌ వుంటుందో, ఆమె వల్ల సినిమాలు ఎలా ఫ్లాప్‌ అవుతాయో మీడియా చెప్పాలని నిలదీసింది. హీరోలని ఏమీ అనలేక హీరోయిన్లని సాఫ్ట్‌ టార్గెట్‌ చేస్తుంటారని, తెలుగు మీడియా చేసిన కామెంట్లకి తాను అసలు ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయే దాన్నని, కానీ లక్కీగా బాలీవుడ్‌ తన టాలెంట్‌ని గుర్తించి మంచి పాత్రలు ఆఫర్‌ చేస్తోందని, పింక్‌ తర్వాత తన కెరియర్‌ స్వరూపమే మారిపోయిందని, గ్లామర్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని ఏనాడూ అనుకోలేదని, నటిగా మెప్పించేందుకే ఇండస్ట్రీకి వచ్చిన తనని గ్లామర్‌ క్యారెక్టర్లకి పరిమితం చేసింది దక్షిణాది చిత్ర పరిశ్రమ అని తాప్సీ చెప్పింది.

తాప్సీ వాలకం చూస్తోంటే ఇక తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకి తిరిగి వచ్చే ఆలోచన లేనట్టు కనిపిస్తోంది. కానీ తను చేసిన 'నామ్‌ షబానా' చిత్రాన్ని మాత్రం తెలుగులోకి 'నేనే షబాన' పేరుతో అనువదించి విడుదల చేయిస్తోంది. తనకున్న పాపులారిటీతో ఆ సినిమా ఇక్కడ క్లిక్‌ అయితే ఇక హిందీలో తను చేసే సినిమాలన్నీ ఇక్కడికీ అనువాదమవుతాయేమో. అలాగే తాప్సీ కోరుకుంటోన్న తరహా పాత్రలని మనవాళ్లూ తనకి ఆఫర్‌ చేస్తారేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు