నారా వారి నంబర్‌ వచ్చేదెప్పుడు?

నారా వారి నంబర్‌ వచ్చేదెప్పుడు?

విభిన్న కథా చిత్రాలు చేస్తున్న హీరోలకి నెమ్మదిగా అయినా గుర్తింపు వచ్చి స్టార్‌డమ్‌ పెరుగుతోంది. నాని, శర్వానంద్‌, నిఖిల్‌ అందరూ కూడా అలా అలా నెమ్మదిగా మార్కెట్‌ పెంచుకున్న వాళ్లే. అయితే కథల ఎంపికలో చాలా మంది కంటే బెటర్‌ టేస్ట్‌ వున్న నారా రోహిత్‌కి మాత్రం కాలం కలిసి రావడం లేదు. ఒకటి రెండు సినిమాలు ఫర్వాలేదనిపించినా కానీ అతనికి ఇంకా కెరియర్‌ డిఫైనింగ్‌ హిట్‌ అయితే రాలేదు.

అలాంటిదొక హిట్టు పడితే తప్ప నారా రోహిత్‌ సినిమాలపై ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి, తన సినిమాల క్వాలిటీ పెంచడానికి ఆస్కారముండదు. అయిదు కోట్ల లోపు బడ్జెట్‌తో సినిమాలు తీసినంత కాలం అతని రేంజ్‌ పెరిగే స్కోప్‌ వుండదు. కథలు ఎంచుకోవడంలో, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో తమిళ హీరోలకి ఏమాత్రం తీసిపోడు. తను ఎంచుకున్న కథలకి న్యాయం కూడా చేస్తుంటాడు. కానీ అదృష్టమే అతడితో దోబూచులాడుతోంది.

'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌ అయిందంటే ఇక అతనికి లక్‌ ఎంత వుందనుకోవాలి? 'మేరా నంబర్‌ కబ్‌ ఆయేగా' అంటూ చూస్తోన్న రోహిత్‌కి ఆ హిట్‌ నంబర్‌ డయల్‌ చేసిపెట్టే సినిమా ఏదవుతుందో ఏమిటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English