ఇతడి కోసమా అంత బిల్డప్?

ఇతడి  కోసమా అంత బిల్డప్?

వారం కిందట అక్కినేని అఖిల్ ‘వీడెవడు’ అనే సినిమా పోస్టర్ షేర్ చేసి అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తించాడు. పోస్టర్లో వెనక్కి తిరిగి నిలుచున్న వాడు ఎవడో ఫిబ్రవరి 14 తెలుస్తుందని చెప్పడంతో అందరూ ఈ తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అఖిల్ ట్వీట్ చేశాడంటే ఎవరో ప్రముఖ హీరో చేసిన సినిమా అయ్యుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రంలో హీరో సచిన్ జోషి హీరో అనేసరికి అందరూ నిట్టూర్చేస్తున్నారు ఇప్పుడు. ఇతగాడి కోసమా ఇంత బిల్డప్ ఇచ్చారు అంటూ లైట్ తీసుకున్నారు జనాలు.

ముంబయి నుంచి టాలీవుడ్ వాళ్లు హీరోయిన్లను.. విలన్లను దిగుమతి చేసుకుంటారు కానీ.. హీరోలను కాదు. ఐతే సచిన్ మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మకాం వేయాలని మొదట్నుంచి తెగ ఆరాటపడిపోతున్నాడు. ఒకప్పుడు మౌనమేలనోయి.. ఒరేయ్ పండు లాంటి సినిమాలు చేసిన సచిన్.. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని రెండేళ్ల కిందట ‘నీ జతగా నేనుండాలి’ అనే సినిమా చేశాడు. అది దారుణమైన ఫలితాన్నిచ్చింది.

మధ్యలో వర్మ దర్శకత్వంలో చేసిన ‘మొగిలిపువ్వు’ అడ్రస్ లేకుండా పోయింది. అయినా ఆశ చంపుకోని సచిన్.. ‘వీడెవడు’ సినిమాతో మరోసారి తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు.. తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారట. ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఫేమ్ తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకుడు. సచినే స్వయంగా నిర్మించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు