ట్రేడ్‌ రిపోర్ట్‌: సింగం ధనాధన్‌... ఓం ఢాం!

ట్రేడ్‌ రిపోర్ట్‌: సింగం ధనాధన్‌... ఓం ఢాం!

సూర్య 'సింగం 3'కి తమిళనాడులో ఆశించిన ఆదరణ లేదు కానీ తెలుగునాట మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. మాస్‌ని నమ్ముకుని తీసిన ఈ చిత్రానికి వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి.

మొదటి వారాంతంలో తెలుగు రాష్ట్రాల నుంచి తొమ్మిది కోట్లకి పైగా షేర్‌ సాధించిన ఈ చిత్రం సోమవారం కూడా మంచి వసూళ్లతో రన్‌ అవుతోంది. మరోవైపు వెంకటేశ్వరస్వామి భక్తులంతా థియేటర్లకి పెద్ద సంఖ్యలో వచ్చేస్తారని భావించిన 'ఓం నమో వెంకటేశాయ'కి మాత్రం వసూళ్లు నిరాశాజనకంగా వున్నాయి. సోమవారం కూడా వసూళ్లలో పెరుగుదల కనిపించకపోగా, డ్రాప్‌ అవడంతో ఇక ఈ చిత్రం నిలబడడం ప్రశ్నార్ధకమే అని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

గత వారం విడుదలైన 'నేను లోకల్‌' ఈవారాంతంలోను సందడి చేయడమే కాకుండా, సోమవారం వసూళ్లలో కొత్త సినిమా 'ఓం నమో వెంకటేశాయ' కంటే బెటర్‌గా నడుస్తోంది. 'నేను లోకల్‌'కి వచ్చే వారం కూడా థియేటర్లు పెద్ద సంఖ్యలోనే కొనసాగించాలని దిల్‌ రాజు డిసైడయ్యాడు. వచ్చే ఆదివారంతో ముప్పయ్‌ కోట్ల లాంఛనం పూర్తి కానుంది. ఈ ఏడాదిలో అన్ని పెద్ద సినిమాలకీ, మిడ్‌ రేంజ్‌ సినిమాలకీ కలిసి వచ్చింది కానీ అదేంటో 'ఓం నమో వెంకటేశాయ'కే ఆ వడ్డీ కాసుల వాడి ఆశీస్సులు దక్కడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు