ఏ ధైర్యంతో పిల్లాడిపై 150 కోట్లు?

ఏ ధైర్యంతో పిల్లాడిపై 150 కోట్లు?

150 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్‌ సినిమా అంటే అదేమంత ఆశ్చర్యకరమైన వార్త కాదు. బాహుబలితో వచ్చిన ఇమేజ్‌తో, పాన్‌ ఇండియా రికగ్నిషన్‌తో ప్రభాస్‌ సినిమాకి ఆమాత్రం ఖర్చు పెట్టవచ్చు. కానీ అంత భారీ బడ్జెట్‌ చిత్రాన్ని హ్యాండిల్‌ చేపే బాధ్యత ఎవరికి ఇచ్చారనేది కూడా చూస్తారు. 150 కోట్ల సినిమా అంటే ఖచ్చితంగా అనుభవజ్ఞుడైన దర్శకుడు వుండాలి. కానీ ఇంతవరకు కనీసం పది కోట్ల సినిమా అయినా హ్యాండిల్‌ చేసి ఎరుగని సుజిత్‌ చేతిలో ఈ భారీ చిత్రాన్ని వుంచారు.

రన్‌ రాజా రన్‌తో దర్శకుడిగా పరిచయమై టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకున్న సుజిత్‌ తన రెండో సినిమాకే నూట యాభై కోట్ల బడ్జెట్‌ సాధించాడు. మొదట్లో యాభై కోట్లలో చేద్దామనుకున్న ఈ ప్రాజెక్ట్‌ షేప్‌ మారిపోయి నూట యాభై కోట్ల సినిమాగా తయారైంది. సుజిత్‌పై యువి క్రియేషన్స్‌ అధినేతలు, ప్రభాస్‌ చూపిస్తున్న నమ్మకం అంతా ఇంతా కాదు. ఏ దర్శకుడికైనా ఇది కలలాంటి ప్రాజెక్ట్‌.
యువి క్రియేషన్స్‌లో ఇప్పటివరకు తెరకెక్కిన ఒకే ఒక్క భారీ చిత్రం మిర్చి. నలభై కోట్లతో తీసిన ఆ చిత్రం తర్వాత వారు ఎక్కువగా చిన్న చిత్రాలకే మొగ్గు చూపారు. మరి నూట యాభై కోట్ల సినిమాని తలపెడుతూ సుజిత్‌లాంటి యువ దర్శకుడిని ఎంచుకున్నారంటే వారి ధైర్యాన్ని ఏమనుకోవాలి? ఇంతవరకు దర్శకుల టాలెంట్‌నే నమ్ముతూ వచ్చిన యువి క్రియేషన్స్‌ ఈసారి కూడా సుజిత్‌ ప్రతిభనే నమ్ముతూ ఇదతను హ్యాండిల్‌ చేస్తాడనే కాన్ఫిడెన్స్‌తో అతను అడిగిన వనరులు అన్నీ సమకూరుస్తున్నారు.

సుజిత్‌ అంత ఎక్సయిట్‌ చేసేట్టుగా ఏ కథ చెప్పాడో, ఈ నూట యాభై కోట్లతో అతనేం చేయబోతున్నాడో అనేది తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు వేచి చూడక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు