మహేష్‌ సినిమా పంబ రేపుతుందట

మహేష్‌ సినిమా పంబ రేపుతుందట

మహేష్‌తో కొరటాల శివ మరో చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్‌ మాస్‌ సినిమా ఇదని ఇండస్ట్రీలో చెబుతున్నారు. అప్పుడే ఈ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడ్డానికి కొరటాల శివ ఇష్టపడడం లేదు. మురుగదాస్‌ చిత్రం పూర్తయిన తర్వాతే ఇది మొదలు పెట్టాలని మహేష్‌ నిర్ణయించుకున్నాడు.

 అయితే తరచుగా కొరటాల శివతో ఇంటరాక్ట్‌ అవుతూ ఈ క్యారెక్టర్‌పై హోమ్‌ వర్క్‌ మాత్రం మొదలుపెట్టేసాడు. శ్రీమంతుడు తర్వాత తమ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఏ స్థాయిలో వుంటే అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తుందనే దానిపై కొరటాల శివకి అవగాహన వుంది. అలాంటి కథ కోసం చూసిన కొరటాల మరో రచయిత దగ్గర్నుంచి కథ తీసుకుని దానికి తనదైన శైలి స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. ఈ కథ గురించి ఇన్‌ఫర్మేషన్‌ వున్నవాళ్లయితే ఈ చిత్రం సంచలనం అవుతుందని, శ్రీమంతుడు కంటే పెద్ద హిట్‌ అవడమే కాకుండా డిస్కషన్‌ టాపిక్‌ అవుతుందని, ఈ చిత్రంలో చాలా సంచలన విషయాలు ప్రస్తావనకి వస్తాయని చెబుతున్నారు.

బాక్సాఫీస్‌ వద్ద పంబ రేపడమే కాకుండా, హీరోగా మహేష్‌ స్థాయిని, దర్శకుడిగా కొరటాల శివ పరపతిని ఈ చిత్రం పెంచుతుందని అంటున్నారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌ చిత్రాల్లో సగటు కమర్షియల్‌ అంశాల జోలికి పోని కొరటాల శివ ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఇంటెన్స్‌గా తీర్చిదిద్దబోతున్నాడట. ఈ చిత్రం గురించిన న్యూస్‌ లీక్‌ అవుతుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తూ వుంటే ఇదంతా నిజమయ్యే సినిమాగా రూపొందితే ఇక తెరపై చూసినప్పుడు ఎలాగుంటుందో కదూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు