నిప్పు రాజేసిన రకుల్‌

నిప్పు రాజేసిన రకుల్‌

'ధృవ' వీడియో సాంగ్స్‌ అన్నీ ఒక్కొక్కటిగా అప్‌లోడ్‌ చేసుకుంటూ... మోస్ట్‌ డిమాండెడ్‌ సాంగ్‌ అయిన 'పరేషానురా'ని చివర్లో విడుదల చేసారు. ఇందులో రకుల్‌ చేసిన అందాల విందుని మళ్లీ మళ్లీ ఆస్వాదించాలని ఆబగా ఎదురు చూస్తోన్న రసిక హృదయులు, కసి హృదయులు ఇప్పుడు అదే పనిగా ఈ పాటని వీక్షిస్తున్నారు.

కేవలం ఒక్క రోజులోనే ఈ పాటకి అయిదు లక్షలకి పైగా వ్యూస్‌ వచ్చాయంటేనే జనం ఏ రేంజ్‌లో చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. విడుదల కాని సినిమాకి చెందిన వీడియోలు వచ్చినపుడు కనిపించే ఊపు ఈ పాట విషయంలో కనిపిస్తోంది. కేవలం రకుల్‌ అందాల కోసమే ఈ పాట చూస్తున్నారనే సంగతి కింద కామెంట్స్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది. అంతకుముందు ఏ సినిమాలోను కనిపించనంత సెక్సీగా రకుల్‌ ఈ పాటలో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.

చాలా చిన్న పాట కావడంతో యూట్యూబ్‌లో కూడా ఈ పాట ఒక్కసారి చూస్తే ఫాన్స్‌కి తనివి తీరడం లేదు. అందుకేనేమో మళ్లీ మళ్లీ చూసేస్తూ లక్షల వ్యూస్‌ ఇచ్చేసారు. విశేషం ఏమిటంటే ఈ పాటలోనే చరణ్‌ తన సిక్స్‌ ప్యాక్‌ బాడీని ఎక్స్‌పోజ్‌ చేస్తూ కనిపిస్తాడు. సో ఇటు అబ్బాయిల నుంచే కాక అటు అమ్మాయిల నుంచి కూడా సైలెంట్‌గా క్లిక్స్‌ పడిపోతున్నట్టే వున్నాయి. ఈ జోరుతో త్వరలోనే యూట్యూబ్‌లో కొత్త రికార్డులని ఈ పాట సెట్‌ చేస్తుందేమో.

Watch Here : Pareshanura Song

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు