ఈవారం సెలవ్‌... కలెక్షన్స్‌ లేవ్‌

ఈవారం సెలవ్‌... కలెక్షన్స్‌ లేవ్‌

కొత్త సినిమాలు వచ్చినపుడల్లా ఎగబడి వెళ్లిపోతున్న ఓవర్సీస్‌ ఆడియన్స్‌ ఈ వారం రెస్ట్‌ తీసుకుంటున్నారు. సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలనీ ఆదరించి, ఆ తర్వాత 'నేను లోకల్‌'కి అద్భుతమైన ఓపెనింగ్స్‌ ఇచ్చి, లోకల్‌ మార్కెట్‌కి యుఎస్‌ మార్కెట్‌ ఏం తీసిపోదని అనిపించిన అక్కడి జనాలు ఎందుకో ఈ వారం సినిమాలకి లీవ్‌ ప్రకటించారు. దీంతో ఈవారం రిలీజ్‌ అయిన సినిమాలకి చుక్కలు కనబడుతున్నాయి.

భక్తిరస చిత్రం కనుక ఫ్యామిలీస్‌తో కలిసి వచ్చేస్తారనే నమ్మకంతో 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాన్ని అయిదున్నర కోట్లకి కొనేసిన పంపిణీదారుడు ఇప్పుడు రాలుతున్న చిల్లర చూసి డీలా పడిపోయాడు. సింగం 3 పరిస్థితి కూడా అలాగే వుంది. తెలుగు, తమిళం కలిపి ట్రాకింగ్‌ చేస్తున్నా ఈ చిత్రానికి అణాకాణీ కలక్షన్లే వస్తున్నాయి. గత వారం అదరగొట్టిన నేను లోకల్‌కి కూడా ఈ వారం వీక్‌ వసూళ్లే వున్నాయి.

అవలీలగా మిలియన్‌ దాటేస్తుందని అనుకున్న సినిమా ఈ వీకెండ్‌లోగా ఆ మార్కు చేరదు కానీ, ఫుల్‌ రన్‌లో దాటుతుందని చెబుతున్నారు. లోకల్‌గా చూస్తే మరీ అలాంటి పరిస్థితి లేకపోవడం ఒకింత ఊరట. అన్ని సినిమాలూ వారాంతంలో బాగానే వసూలు చేస్తున్నాయి. లోకల్‌ మార్కెట్‌ ఎంత నమ్మకమైనదో, ఓవర్సీస్‌ మార్కెట్‌ ఎంతటి చపలమైనదో ఈ వారం తేలిపోయింది. గుడ్డిగా కొంటూ పోతే అక్కడ ఏదో ఒక సినిమాకి ఇత్తడైపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు