ఆమె పని అయిపోయినట్టే ఇక

ఆమె పని అయిపోయినట్టే ఇక

పదేళ్లకి పైగా తెలుగు చిత్ర సీమలో ఒక వెలుగు వెలిగిన అనుష్క ఇప్పటికీ టాప్‌ బడ్జెట్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. అయితే ఇక ఎంతో కాలం అనుష్క కొనసాగకపోవచ్చునని ఆమె తాజా చిత్రాలు చూసిన వాళ్లు ముక్తకంఠంతో అభిప్రాయపడుతున్నారు.

'సింగం 3', 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాల్లో అనుష్క చాలా లావుగా వుంది. గ్లామర్‌ హీరోయిన్‌గా వెలిగిన తనని ఒళ్లంతా కప్పి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా సందర్భాల్లో అనుష్క క్లోజ్‌ అప్‌లతోనే సినిమాటోగ్రాఫర్లు కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. ఫుల్‌ ఫ్రేమ్‌లో, మిడ్‌ ఫ్రేమ్‌లో కూడా ఆమె చాలా ఆక్వార్డ్‌గా కనిపిస్తూ వుండడంతో అనుష్కని కేవలం తనకున్న స్టార్‌డమ్‌కి అనుగుణంగా తీసుకుంటున్నారే తప్ప తన వల్ల సినిమాలకి న్యాయం జరగడం లేదు.

అనుష్కకి వస్తోన్న ఫీడ్‌ బ్యాక్‌ కూడా బ్యాడ్‌ వుండడంతో ఇక తనకి అవకాశాలివ్వాలంటే అనుష్క ఒళ్లు తగ్గించుకోక తప్పదు. బాహుబలి పోస్టర్‌లో ఫోటోషాప్‌ వాడారనే విమర్శలు నిజమేనని ఈ రెండు చిత్రాలు నిరూపించాయి. మరి అనుష్కని సన్నగా చూపించేందుకు రాజమౌళి ఏమి చేస్తాడో చూడాలి. సైజ్‌ జీరో చిత్రం కోసం ఒళ్లు పెంచిన అనుష్క, ఆ చిత్రంతో విజయాన్ని అందుకోలేకపోగా, తన షేప్‌ మొత్తం పాడు చేసుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు