భక్త కన్నప్పగా సునీల్!

భక్త కన్నప్పగా  సునీల్!

హాస్యనటుడిగా, కథానాయకుడిగా ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తున్నారు సునీల్. ఆయన త్వరలోనే తెరపై భక్తిరసాన్ని ఒలికించబోతున్నారు. అపర శివభక్తుడు భక్తకన్నప్పగా తెరపై సందడి చేయబోతున్నాడు.  ప్రముఖ నటుడు, రచయిత దర్శకుడు తనికెళ్ళ భరణి భక్త కన్నప్ప జీవితంపై ఓ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారు. అందులో సునీల్ నటించబోతున్నారని తాజా తెలుస్తోంది. ఇటీవలే స్క్రిప్ట్ గురించి విన్న సునీల్ ఈ సినిమా చేయడానికి తన అంగీకారం తెలిపినట్టు సమాచారం.

తనికెళ్ళ భరణి ఇటీవల `మిథునం` సినిమా తీసి విమర్శకుల ప్రసంశలు పొందారు. ఆ సినిమా ఆస్కార్ నామినేషన్లకు కూడా ఎంపికైంది. స్వతహాగా శివభక్తుడైన తనికెళ్ళ భరణి... భక్తకన్నప్ప కథను కొత్తకోణంలో రాసుకున్నట్టు తెలుస్తోంది. ఇదివరకు `భక్త కన్నప్ప` పేరుతో ప్రముఖ దర్శకుడు బాపు ఓ సినిమా తీశారు. కృష్ణం రాజు ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ నయా కన్నప్ప ఏవిధంగా అలరిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English