ఆ డైరెక్టర్‌ని హీరో పచ్చి బూతులు తిట్టాడట

ఆ డైరెక్టర్‌ని హీరో పచ్చి బూతులు తిట్టాడట

'యే దిల్‌ హై ముష్కిల్‌', 'శివాయ్‌' చిత్రాల క్లాష్‌ విషయంలో కరన్‌ జోహార్‌కి, అజయ్‌ దేవ్‌గణ్‌కి మధ్య విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. 'శివాయ్‌' చిత్రాన్ని తొక్కేయమని తనకి కరణ్‌ జోహార్‌ లక్షల రూపాయలు ఆఫర్‌ చేసాడంటూ కమాల్‌ ఆర్‌. ఖాన్‌ అనే ఫిలిం క్రిటిక్‌ ట్విట్టర్లో పెట్టడంతో వీరి మధ్య విబేధాలు వీధిన పడ్డాయి.

ఆ టైమ్‌లో అజయ్‌ తనకి ఫోన్‌ చేసి దుర్భాషలాడాడని, పరుష పదజాలంతో పచ్చి తిట్లు తిట్టాడని కరణ్‌ జోహార్‌ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌ అయ్యాడు. ఆయన భార్య కాజోల్‌ గురించి ఒక పార్టీలో తానేదో మాట్లాడినట్టు అజయ్‌కి ఎవరో చెప్పారని, దానిని పట్టుకుని తనని తిట్టి పోసాడని, కనీసం అది నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని, తనకి వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తిట్టేసి ఫోన్‌ పెట్టేసాడని కరణ్‌ చెప్పాడు.

అయితే అజయ్‌ మాటల కంటే కూడా కాజోల్‌ ప్రవర్తనే తనని బాధించిందని తెలిపాడు. ఒక క్రిటిక్‌ ఎవరో తనపై ఆరోపణలు చేస్తే అది వాస్తవమా, కాదా అని తనకి ఫోన్‌ చేసి అడిగే చనువు, స్నేహం ఉన్నప్పటికీ ఫోన్‌ చేయలేదని, తన భర్త తనని పబ్లిక్‌ ప్లాట్‌ఫారంలో అవమానిస్తుంటే అతడిని వారించడం పోయి సపోర్ట్‌ చేసిందని, ఆ రోజుతోనే తన జీవితంలో ఇక కాజోల్‌ లేదని డిసైడ్‌ అయిపోయానని, ఇక ఆమెతో ఎప్పటికీ ప్యాచ్‌ అప్‌ కాలేనని, తన హృదయం బద్ధలైపోయిందని కరణ్‌ అన్నాడు.

విశేషం ఏమిటంటే అప్పుడు జరిగిన క్లాష్‌లో రెండు సినిమాల్లో దేనికీ ప్లస్‌ లేదా మైనస్‌ అవలేదు. రెండూ అంతంతమాత్రం సినిమాలే కావడంతో యావరేజ్‌ రిజల్ట్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ కాంట్రవర్సీల వల్ల కూడా ఎక్స్‌ట్రా కాసులు రాలకపోగా, అనవసరంగా విబేధాలు పొడసూపాయి. ఈ పుల్లలన్నీ పెట్టిన కమాల్‌ ఆర్‌. ఖాన్‌ మాత్రం తన సహజ శైలిలో అవతలి వారిపై బురద జల్లుకుంటూ హ్యాపీగానే వున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు