ఆ హీరోకి తగ్గిపోతున్న ప్రజాకర్షణ

ఆ హీరోకి తగ్గిపోతున్న ప్రజాకర్షణ

సూర్య సినిమాలు తెలుగునాట బాగా ఆడుతున్నాయి కానీ తనని సొంత జనాలే పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. సింగం 3 చిత్రానికి తెలుగులో మంచి ఓపెనింగ్‌ వచ్చింది. అతని మార్కెట్‌ ఎంత వుందని బయ్యర్లు నమ్మకంగా ఈ చిత్రం హక్కులని కొన్నారో, అందుకు తగ్గట్టే ఈ చిత్రానికి వసూళ్లు వస్తున్నాయి.

కానీ తమిళనాడులో మాత్రం మరోసారి సూర్య సినిమా ఓపెనింగ్‌ ఆశించన స్థాయిలో రాలేదు. విడుదలకి ముందు బుకింగ్స్‌ వీక్‌గా వుంటే, విడుదలయ్యాక మెరుగు పడుతుందని అనుకున్నారు. కానీ అది జరగలేదు. దాదాపు అరవై కోట్ల రూపాయలని తమిళం నుంచి సింగం 3 రికవర్‌ చేసుకోవాలి. ఆ డబ్బులు రావాలంటే ఓపెనింగ్‌ అదిరిపోవాలి.

మొదటి మూడు రోజుల్లో ముప్పయ్‌ కోట్ల షేర్‌ అయినా రాబట్టుకుంటే ఆ తర్వాత మిగతాది వస్తుందని ఆశపడవచ్చు. కానీ ఈ సినిమాకి వచ్చిన నామమాత్రపు ఓపెనింగ్‌ చూస్తే సూర్యకి జనాకర్షణ తగ్గిపోతోందనిపిస్తోంది. 24 చిత్రం తెలుగులో మంచి ఓపెనింగ్స్‌ తెచ్చుకుంటే తమిళంలో స్ట్రగుల్‌ అయింది. ఇక్కడ అబౌ యావరేజ్‌గా ఆడిన ఆ చిత్రం తమిళంలో మాత్రం డిజాస్టర్‌ అయింది. సూర్యకి వరుసగా తగులుతోన్న పరాజయాలతో అతని మార్కెట్‌ బాగా పడిపోయింది. సింగం 3లాంటి మాస్‌ని ఆకట్టుకునే సినిమాకి కూడా ఇలాంటి వసూళ్లంటే ఆలోచించాల్సిన విషయమే మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు