వామ్మో అనుష్క.. ఏంటిది?

వామ్మో అనుష్క.. ఏంటిది?

‘సైజ్ జీరో’ తన కెరీర్లో మరపురాని సినిమా అయిపోతుందని భావించింది అనుష్క. కానీ ఆ సినిమా ఆమెకు ఇంకో రకంగా గుర్తుండిపోయింది. ఈ సినిమా కోసం అతిగా బరువు పెరిగిపోవడం అనుష్క కొంప ముంచింది. కెరీర్లో ఎన్నడూ పడనంత కష్టపడి బరువు పెరిగితే.. ఆ బరువంతా తగ్గించుకోవడానికి ఇంకా కష్టపడాల్సి వచ్చింది.

అయినా మామూలు షేపుల్లోకి రావడం అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఈ లోపే ‘సింగం-3’ సినిమా చేయాల్సి వచ్చింది అనుష్క. ‘సైజ్ జీరో’లో పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి అనుష్కను చూసి ఎలాగోలా తట్టుకున్నారు కానీ.. ‘సింగం-3’ అలా కాదు. ఈ సిరీస్‌లో తొలి రెండు భాగాలకు అనుష్క గ్లామరే ప్రధాన ఆకర్షణ అయింది.

అనుష్కను ఆ సినిమాల్లో అలా చూసిన ప్రేక్షకులకు.. సింగం-3లో ఆమెను చూస్తే పెద్ద షాకే తగిలింది. భారీ అవతారంలో ఆమెను చూసి దిమ్మదిరిగిపోయింది. సూర్యతో కలిసి చేసిన డ్యూయెట్లో మోడర్న్ డ్రెస్సుల్లో అనుష్క భారీ అవతారం చూసి జనాలకు మతిపోయింది. చాలా ఎబ్బెట్టుగా కనిపించింది అనుష్క ఆ పాటలో.

సినిమాలో అనుష్క రోల్ పరిమితమే కానీ.. కనిపించినపుడల్లా ఏదోలా అనిపించింది ఆమెను చూస్తుంటే. ఎలా ఉండే అనుష్క ఎలా అయిపోయిందని ఫీలైపోయారు ఆడియన్స్. తొలి రెండు భాగాలకు ప్లస్ అయిన అనుష్కే ఈ చిత్రానికి మాత్రం మైనస్ అయింది. అనుష్క ఇలా ఉన్నా కూడా ఆమె పాత్రను కొనసాగించాలని నిర్ణయించుకోవడంలో సూర్య, హరిల పెద్ద మనసుకు జోహార్లు చెప్పాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు