నాగబాబు మాట: పవన్ ‌ఫ్యాన్స్ ను తిట్టాల్సింది కాదు

నాగబాబు మాట: పవన్ ‌ఫ్యాన్స్  ను తిట్టాల్సింది కాదు

నాగబాబు కొంచెం ఆలస్యంగా పశ్చాత్తాపం చెందుతున్నాడు. ఏడాదిన్నర కిందట మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తాను తిట్టిపోయడంపై ఇప్పుడు చింతిస్తున్నాడు. పవన్ అభిమానులు శ్రుతిమించిపోయినప్పటికీ తాను వాళ్ల మీద ఆ స్థాయిలో విరుచుకుపడాల్సింది కాదని నాగబాబు అభిప్రాయపడ్డాడు.

పవన్ కల్యాణ్ అభిమానులంటే మెగా అభిమానులేనని.. పవన్ ఎదుగుదలకు వారంతా పిల్లర్ల లాగా ఉపయోగపడ్డారని నాగబాబు అన్నాడు. ఐతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్లలో వారు చేసే గోల శ్రుతి మించిపోయిందని.. అదీ కాక తమ ఫ్యామిలీ హీరోల కార్యక్రమాల్లోనే కాకుండా ఇతర హీరోల ఫంక్షన్లలోనూ వారు చేసే అల్లరి వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని నాగబాబు అన్నాడు. ఐతే ఒక హీరోపై నిజమైన ప్రేమను చూపించేది అభిమానులేనని.. కాబట్టి న్యూసెన్స్ చేశారని అభిమానులపై తాను ఆగ్రహం వ్యక్తం చేసినందుకు చింతిస్తున్నానని నాగబాబు చెప్పాడు. ఐతే ఆ సమయంలో తనకు అదే కరెక్ట్ అనిపించి.. అభిమానుల్ని తిట్టానని నాగబాబు అన్నాడు.

2015లో చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తుంటే నాగబాబు కోపం పట్టలేకపోయాడు. పవన్ ఎందుకు ఇలాంటి కార్యక్రమాలకు రావట్లేదో అతడి ఇంటి ముందుకు వెళ్లి అడగాలని.. అంతే తప్ప ఇక్కడ వచ్చి గొడవ చేయడం సంస్కారం కాదని నాగబాబు తీవ్ర స్వరంతో అభిమానులపై మండి పడ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English