పవన్‌కళ్యాణ్‌ నిజంగానే శంకర్‌ని కొట్టాడా?

పవన్‌కళ్యాణ్‌ నిజంగానే శంకర్‌ని కొట్టాడా?

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌లో కమెడియన్‌ షకలక శంకర్‌పై పవన్‌కళ్యాణ్‌ చేయి చేసుకున్నాడనే రూమర్‌ బాగా వినిపించింది. పవన్‌ ఎలాగూ అలాంటి వాటికి స్పందించడు నుక అతని వైపు స్టోరీ ఎప్పటికీ బయటకి రాదు. మరి దెబ్బలు తిన్నాడన్న శంకర్‌ వెర్షన్‌ ఏంటి? ''అన్నమయ్యని వెంకటేశ్వరస్వామి కొట్టాడంటే నమ్ముతారా? రామదాసుని శ్రీరాముడు కొట్టాడంటే నమ్ముతారా? ఇదీ అంతే. నమ్మకండి'' అంటూ తనని కొట్టే అవకాశమే లేదని, పవన్‌ దేవుడైతే తాను భక్తుడినని షకలక శంకర్‌ చెప్పాడు.

వంద వ్యాపకాలున్న పవన్‌కి తనలాంటి అభిమానులు కోట్లలో వుంటారని, ఎప్పుడైనా తమపై కోప్పడే హక్కు, అధికారం ఆయనకి వున్నాయని, అంతే తప్ప చీమకి కూడా హాని తలపెట్టని మనస్తత్వమున్న పవన్‌పై ఇలాంటి అసత్య ప్రచారాలు కూడదని అన్నాడు. కొట్టలేదని గట్టిగా చెప్పినా, తనని మందలించిన మాట వాస్తవమే అనేది శంకర్‌ మాటల్లో ధ్వనించింది.

అయితే పవన్‌పై తనకి ప్రేమ తగ్గలేదని, ఇప్పటికీ తాను పవర్‌స్టార్‌ భక్తుడినే అంటూ పవన్‌ కోసం రాసుకున్న ఓ పద్యాన్ని ఆలపించాడు. తన భుజంపై చెయ్యి వేసి 'ఎందుకురా నేనంటే అంత ఇష్టం నీకు' అని పవన్‌ అడిగాడని, అంతకంటే తనకేం కావాలని శంకర్‌ సంబరపడుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు