కిక్‌ ఇచ్చే సెంటిమెంట్‌

కిక్‌ ఇచ్చే సెంటిమెంట్‌

అల్లు అర్జున్‌తో హరీష్‌ శంకర్‌ రూపొందిస్తోన్న దువ్వాడ జగన్నాధమ్‌ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తన గురువు పూరి జగన్నాధ్‌ మాదిరిగా వేగంగా షూటింగ్‌ పూర్తి చేసే హరీష్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని కూడా పిచ్చ క్లారిటీతో అస్సలు ప్యాచ్‌ వర్క్‌లు అవసరం లేకుండా పర్‌ఫెక్ట్‌గా అనుకున్న టైమ్‌కి తీస్తున్నాడట. షెడ్యూల్‌ వేసుకున్న దానికంటే ముందుగానే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తవుతోందని సమాచారం.

సమ్మర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్‌ మార్చిలో మొదలు పెట్టాలని దిల్‌ రాజు అనుకున్నాడు. కానీ తనకి మహాశివరాత్రి సెంటిమెంట్‌ వుందని హరీష్‌ శంకర్‌ చెప్పడంతో టీజర్‌ని అదే రోజున విడుదల చేయడానికి దిల్‌ రాజు అంగీకరించాడట. హరీష్‌ శంకర్‌ తీసిన 'గబ్బర్‌సింగ్‌' టీజర్‌ కూడా మహాశివరాత్రికే రిలీజైంది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ అయినట్టే ఇదీ అవుతుందని శివుడి ఆశీస్సుల కోసం డిజె టీజర్‌ని ఆ రోజున విడుదల చేయబోతున్నారు.

హరీష్‌ శంకర్‌ టీజర్‌ అంటే సంచలనాత్మక డైలాగ్‌ వుంటుందని ఫాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. 'నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది' అంటూ గబ్బర్‌సింగ్‌ టీజర్‌ ఎంత సంచలనం చేసిందో గుర్తుండే వుంటుంది. 'బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా' అనే 'రామయ్యా వస్తావయ్యా' డైలాగ్‌ టీజర్‌ కూడా అప్పట్లో జూనియర్‌ ఫాన్స్‌కి కిక్‌ ఇచ్చింది. మరి స్టయిలిష్‌ స్టార్‌తో హరీష్‌ ఏ రేంజ్‌ పంచ్‌ పేలుస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు