త్రివిక్రమ్‌కి మళ్లీ హ్యాండ్‌ ఇచ్చేలాగున్నాడు

త్రివిక్రమ్‌కి మళ్లీ హ్యాండ్‌ ఇచ్చేలాగున్నాడు

తమిళ సంగీత సంచలనం అనిరుధ్‌ని ఎలాగైనా టాలీవుడ్‌కి పరిచయం చేయాలని త్రివిక్రమ్‌ చాలా కాలంగా ప్లాన్‌ చేస్తున్నా కానీ కుదర్లేదు. 'అ ఆ' సినిమాకి అనిరుధ్‌తో మ్యూజిక్‌ చేయించుకోలేక చేతులెత్తేసి అప్పటికప్పుడు మిక్కీ జె. మేయర్‌ని సైన్‌ చేసుకున్నాడు.

ఆ సినిమాకి హ్యాండిచ్చినా కానీ పవన్‌తో తను తీయబోయే చిత్రానికి మళ్లీ అనిరుధ్‌నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఈసారి తప్పకుండా పాటలు చేసి ఇస్తానన్న అనిరుధ్‌తో ఇంతవరకు త్రివిక్రమ్‌ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరపలేదట. జనవరిలోనే మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ వుంటాయని చెప్పిన త్రివిక్రమ్‌ ఆ డేట్లు కాన్సిల్‌ చేయడంతో అనిరుధ్‌ ఇంకా తన తదుపరి డేట్స్‌ ఇవ్వలేదట. పవన్‌కళ్యాణ్‌ ఇంకా రెడీగా లేని కారణంగా త్రివిక్రమ్‌ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ వాయిదా వేసినట్టు తెలిసింది.

అయితే షూటింగ్‌తో సంబంధం లేకుండా ముందుగా అనిరుధ్‌తో పాటలు చేయించుకోకుండా త్రివిక్రమ్‌ ఎందుకని ఈ సిట్టింగ్స్‌ కాన్సిల్‌ చేసాడో మరి. అసలే తమిళ చిత్ర సీమలో క్షణం తీరిక లేకుండా పని చేసే అనిరుధ్‌ మళ్లీ సకాలంలో దొరుకుతాడో లేదో కూడా చెప్పడం కష్టం. బ్రూస్‌లీ, అ ఆ చిత్రాలని వదిలేసుకుని తనకి తమిళ సినిమాల కంటే ఎక్కువేం కాదని అతను ఇంతకుముందే నిరూపించుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు