సింగం 3 ప్రీ రిలీజ్‌ టాక్‌

సింగం 3 ప్రీ రిలీజ్‌ టాక్‌

వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చిన 'సింగం 3' ఈ గురువారం విడుదలకి సిద్ధమవుతోంది. హరి, సూర్య దర్శకత్వంలో వచ్చిన 'సింగం' ఫ్రాంచైజీలోని మొదటి రెండు చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి.

మాస్‌ని ఆకట్టుకునే పవర్‌ఫుల్‌ హీరోయిజమ్‌, డైలాగ్స్‌కి సింగం ఫ్రాంచైజీ పెట్టింది పేరు. మొదటి రెండు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడంతో 'సింగం' కథలోని ఆఖరి అంకాన్ని దర్శకుడు హరి మరింత ఘనంగా తీర్చిదిద్దాడు. భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోను విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్‌ అవుతోంది. తెలుగులో ఈ చిత్రానికి దాదాపు ఇరవై కోట్ల బిజినెస్‌ జరిగినట్టు అంచనా.

ఒక అనువాద చిత్రంపై ఇంత పెట్టుబడి పెట్టారంటేనే ఈ చిత్రంపై బయ్యర్లకి వున్న నమ్మకమేంటో అర్థం చేసుకోవచ్చు. ప్రోమోస్‌తో ఆకట్టుకోలేకపోయిన 'సింగం 3' ఇన్ని వాయిదాల తర్వాత వచ్చి ప్రేక్షకులని మెప్పించగలదా? ఇంతకీ ఈ చిత్రం టాక్‌ ఏంటి? ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్‌ని బట్టి 'సింగం 3' కూడా మొదటి రెండు చిత్రాల మాదిరిగానే పరుగులు పెట్టే కథనంతో ఆద్యంతం ఉత్కంఠ రేపుతుందట.

యాక్షన్‌ సీన్స్‌ చాలా బాగా వచ్చాయట. సినిమాలో అసలు డల్‌ మూమెంట్‌ వుండదని, హీరో ఎలివేషన్‌ సీన్స్‌, డైలాగ్స్‌తో మాస్‌తో విజిల్స్‌ కొట్టించేలా వుంటుందని చెబుతున్నారు. అసలే మాస్‌కి నచ్చిన క్యారెక్టర్‌ కావడంతో ఖచ్చితంగా దీనికి ఓపెనింగ్‌ వుంటుంది. ఈ టాక్‌కి తగ్గట్టు సినిమా వున్నట్టయితే బాక్సాఫీస్‌ వద్ద సింహ గర్జన్‌ ఖాయం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English