వంద కోట్లు.. మెగా హీరోల మ్యాజిక్

వంద కోట్లు.. మెగా హీరోల మ్యాజిక్

కాస్త ఆలస్యమైనా మెగాస్టార్ సాధించాడు. చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ రూ.100 కోట్ల షేర్ కొల్లగొట్టేసింది. అఫీషియల్‌గానే ఈ రికార్డును ప్రకటించేశారు. ఇప్పుడు నిజంగా ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని ఒప్పుకోవాల్సిందే. ‘బాహుబలి’ తర్వాత రూ.100 కోట్ల షేర్ అందుకున్న తెలుగు సినిమా ‘ఖైదీ నెంబర్ 150’నే. ‘శ్రీమంతుడు’ పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ కొల్లగొట్టేయడమే కాదు.. కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ వసూళ్లను కూడా దాటింది చిరు సినిమా.

చిరు ఖాతాలో ఇంకో స్పెషల్ రికార్డు కూడా పడింది. సౌత్ ఇండియాలో ఒక్క భాషలో మాత్రమే విడుదలైన సినిమాల్లో మొదట రూ.100 కోట్ల షేర్ సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. రోబో.. లింగా.. కబాలి.. బాహుబలి లాంటి సినిమాలు మల్టీ లాంగ్వేజెస్‌ లో రిలీజయ్యాయి. మరో విశేషం ఏంటంటే.. తెలుగులో ఏ రకంగా అయినా రూ.100 కోట్ల మార్కును ముందుగా అందుకున్నది మెగా ఫ్యామిలీ హీరోలే కావడం విశేషం.

తెలుగు సినిమా తొలిసారి వంద కోట్ల గ్రాస్ క్లబ్బులోకి చేరింది రామ్ చరణ్ ‘మగధీర’తోనే. ఇక తెలుగులో తొలి రూ.100 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’. ఇప్పుడు చిరు రూ.100 కోట్ల షేర్‌ తో నాన్-బాహుబలి రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ రకంగా టాలీవుడ్ బాక్సాఫీస్ లో మెగా హీరోల ఆధిపత్యం కొనసాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు