లేట్‌ చేస్తే సిద్దు తట్టుకుంటాడా?

లేట్‌ చేస్తే సిద్దు తట్టుకుంటాడా?

తెలుగులో ఇక హిట్లు కొట్టలేనని మానసికంగా డిసైడైపోయిన ఫ్యామిలీ హీరో సిద్దార్ద్‌, ఇప్పుడు తమిళంలో దంచేస్తున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. అయినా సరే మనోడ్ని పెళ్ళి అనే ఒక ఘట్టం వెంటాడుతూనే ఉందట.

కాలేజ్‌ రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకొని విడాకులు ఇచ్చిన సిద్దార్ద్‌, తరువాత సోహా ఆలి ఖాన్‌, శృతిహాసన్‌లతో ప్రేమ విఫలమై హైటెక్‌ దేవదాసులా మారిపోయాడు. ఇక ఇదే సమయంలో అందాల భామ సమంత దొరకడంతో, త్వరగా పెళ్ళిచేసుకుందామని తొందర పెట్టేస్తున్నాడట సిద్దు. అయితే సమంత మాత్రం ప్రస్తుతం ఒక సంవత్సరం వరకు సినిమా షూటింగ్‌లతో బిజీ కాబట్టి, పెళ్ళి గురించే ఆలోచించే ప్రసక్తే లేదని ఇవాళ తేల్చిచెప్పేసింది.

అంటే మన ఫ్లాప్‌ హీరో అమ్మడు కోసం మినిమం వన్‌ ఇయర్‌ వేచిచూడాల్సిందే. మరి అంత లేట్‌ చేస్తే, సిద్దార్ధకు తట్టుకొనే శక్తి ఉందా? గతంలో కూడా తన ప్రేయసిలను ఇలానే తొందరపెట్టేసి, తరువాత ఒక ఫైన్‌ డే బ్రేకప్‌ అనే వరకు తెచ్చుకున్నాడు. మరి సమంత విషయంలోనైనా వ్యవహారం పెళ్ళి పీటలు ఎక్కుతుందా, లేకపోతే యథావిదిగా బ్రేకప్‌ దేవత శివతాండవం చేస్తుందా...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు