దేవిశ్రీని తీసేయడంపై సూర్య

దేవిశ్రీని తీసేయడంపై సూర్య

‘సింగం’ అనగానే సూర్యతో పాటుగా దేవిశ్రీ ప్రసాద్ కూడా గుర్తుకొస్తాడు. సింగం సింగం.. అంటూ అతడి వాయస్‌తో వచ్చే థీమ్ సాంగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సింగం రెండు పార్టుల‌కూ అతడి మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐతే ఆశ్చర్యకరంగా సింగం-3 నుంచి అతడిని తప్పించి.. హ్యారిస్ జైరాజ్‌కు సంగీత బాధ్యతలు అప్పగించింది సూర్య అండ్ కో. మరి దేవిశ్రీని ఎందుకు తప్పించారంటూ సూర్యను అడిగితే అతను ఏమని సమాధానం ఇచ్చాడంటే..

‘‘దేవిశ్రీని ఈ సినిమాకు దూరం పెట్టడం మా అందరికీ కఠిన నిర్ణయం. ఐతే కొన్నిసార్లు సినిమా కోసం ఇలాంటి నిర్ణయాలు తప్పవు. హ్యారిస్ జైరాజ్ నాతో చాలా సినిమాలు చేశాడు. నా టేస్ట్ ఏంటో అతడికి తెలుసు. సింగం-3కి కొంచెం డిఫరెంట్ మ్యూజిక్ ఉండాలనుకున్నాం. అందుకే అతడికి ఛాన్సిచ్చాం. ఐతే దేవిశ్రీ ప్రసాద్ ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ సినిమాను హ్యారిస్‌కు అప్పగించి.. మాకు శుభాకాంక్షలు చెప్పాడు’’ అని సూర్య తెలిపాడు.

ఇంతకీ సింగం సిరీస్‌లో రెండు సినిమాలు చేశాక మూడో పార్ట్ కూడా తీయడం బోరింగ్‌గా అనిపించలేదా అని సూర్యను అడిగితే.. ‘‘ముందు మాకు మూడో పార్ట్ తీసే ఉద్దేశం లేదు. కానీ నేను, హరి ఎక్కడికి వెళ్లినా జనాలు సింగం-3 ఎప్పుడు అని అడగడం మొదలుపెట్టారు. జనాల్లో అంత ఆసక్తి ఉన్నపుడు సినిమా చేస్తే తప్పేముందనిపించింది. జనాలు ఆస్వాదిస్తున్నంత కాలం ఈ ఫ్రాంఛైజ్ కొనసాగుతుంది. వాళ్లకు రుచించలేదంటే ఆపేస్తాం’’ అని సూర్య చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు