నాగబాబు అలాంటి స్థితికి చేరాడా?

నాగబాబు అలాంటి స్థితికి చేరాడా?

రామ్ చరణ్ హీరోగా నాగబాబు నిర్మించిన ‘ఆరెంజ్’ ఆయనకు భారీ నష్టాలు మిగిల్చిందన్న సంగతి తెలుసు. ఆ నష్టాల్ని పవన్ కళ్యాణ్ భర్తీ చేశాడన్న సంగతీ తెలుసు. ఐతే నాగబాబు ఆ సినిమా మిగిల్చిన చేదు అనుభవంతో ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకునే స్థితికి చేరాడన్న సంగతి చాలామందికి తెలియదు. స్వయంగా ఈ విషయం నాగబాబే చెప్పాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. ‘ఆరెంజ్’ సినిమా తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందో ఒక ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చడు నాగబాబు.

‘‘నేను అప్పటికి ఒక పెద్ద ఇంట్లో ఉండేవాడిని. దాని రెంట్ 90 వేల దాకా ఉండేది. కానీ తర్వాత 20 వేల ఇంటికి మారిపోవాల్సి వచ్చింది. నా కార్లన్నీ అమ్మేశాను. ఒక్కటి మాత్రమే ఉంచుకున్నాను. అది కూడా తప్పదు కాబట్టే. ఇంటి బేసిక్ నీడ్స్ అన్నీ కట్ చేసుకుని మినిమం మనీతో బతకాల్సి వచ్చింది. అప్పటికి నా ఆదాయం కూడా చాలా తక్కువ ఉండేది. తర్వాతి నెలకు డబ్బులు కావాలని అన్నయ్యనో తమ్ముడినో అడాల్సిన పరిస్థితి రావడంతో ఒక దశలో ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆ విషయంలో స్థిర నిర్ణయం ఏదీ తీసుకోలేదు. అలాంటి స్థితిలో కాస్త ముందు వెనుక అన్నయ్య.. కళ్యాణ్ ఇద్దరూ ఫోన్ చేశారు. వాళ్లిద్దరూ నాకు భరోసా ఇచ్చారు. నష్టం ఎంతైనా తామిద్దరం భరిస్తామని.. అస్సలు బాధపడవద్దని ధైర్యం చెప్పారు. ఈ విషయాల్ని వాళ్లు మరిచిపోయారేమో కానీ.. నేను మరిచిపోలేదు’’ అని నాగబాబు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు