అల్లు అర్జున్‌ ఇంకా చెప్పట్లేదు బ్రదర్‌

అల్లు అర్జున్‌ ఇంకా చెప్పట్లేదు బ్రదర్‌

'చెప్పను బ్రదర్‌' కాంట్రవర్సీ తర్వాత పవన్‌కళ్యాణ్‌ ఫాన్స్‌ని మచ్చిక చేసుకోవడానికి అల్లు అర్జున్‌ అస్సలు ప్రయత్నించడం  లేదు. పవన్‌కళ్యాణ్‌ సినిమా టీజర్‌ వచ్చినపుడు యువ మెగా హీరోలందరూ ఫాన్స్‌ని ఉత్సాహపరిచేలా రెస్పాండ్‌ అయి టీజర్‌పై తమ రియాక్షన్స్‌ పోస్ట్‌ చేసారు. సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ ట్విట్టర్‌ ద్వారా 'కాటమరాయుడు' టీజర్‌కి రెస్పాన్స్‌ తెలియజేస్తే, చరణ్‌ 'ఫేస్‌బుక్‌'లో సూపర్బ్‌ అంటూ టీజర్‌కి కితాబిచ్చాడు.

కానీ అల్లు అర్జున్‌ మాత్రం ఈ టీజర్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎవరి సినిమాలకీ రియాక్ట్‌ కావడం లేదా అంటే, అడపాదడపా కొన్ని చిత్రాలకి తన విషెస్‌ చెబుతూనే వుంటాడు. సంక్రాంతికి గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానర భవతి చిత్రాలకి కూడా అల్లు అర్జున్‌ తన బెస్ట్‌ విషెస్‌ అందజేసాడు. కానీ పవన్‌కళ్యాణ్‌ సినిమా గురించి మాత్రం మౌనం పాటిస్తున్నాడు. విశేషం ఏమిటంటే అల్లు అర్జున్‌తో పాటు అతని తమ్ముడు శిరీష్‌ కూడా 'కాటమరాయుడు' గురించి స్పందించలేదు. అర్జున్‌ మాట ఎలా వున్నా శిరీష్‌ అయితే అన్ని సినిమాల గురించి తన కామెంట్స్‌ పెడుతూనే వుంటాడు. చూస్తుంటే అల్లు బ్రదర్స్‌ ఇద్దరూ పవన్‌ విషయంలో 'చెప్పను బ్రదర్‌' స్లోగన్‌కే స్టిక్‌ అయినట్టున్నారు. దీంతో అల్లు ఫ్యామిలీతో పవన్‌ విబేధాల గురించిన పుకార్లు ఇంకా ఇంకా బలపడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు