హోప్స్‌ వదిలేసుకున్న అనుష్క

హోప్స్‌ వదిలేసుకున్న అనుష్క

ఆమధ్య సైజ్‌ జీరో సినిమాలో క్యారెక్టర్‌ కోసం అనుష్క బరువు పెరిగింది. అయితే ఆ సినిమా రిలీజ్‌ అయి చాన్నాళ్లవుతున్నా అనుష్క పూర్వ రూపం సంతరించుకోలేదు. మామూలుగా నటీనటులకి క్యారెక్టర్ల కోసం బరువు పెరగడం, తగ్గడం చాలా సాధారణ విషయం.

కానీ అనుష్కకి మాత్రం పెరిగిన బరువు తగ్గించుకోవడం కుదర్లేదు. యోగా శిక్షకురాలయిన అనుష్క బరువు తగ్గడానికి తగిన వ్యాయామాలు కనిపెట్టలేకపోవడం విచిత్రమే. బరువు తగ్గడం కోసం చాలా ప్రయత్నాలు చేసినా, మెడికల్‌ హెల్ప్‌ తీసుకున్నా కానీ అనుష్క శరీరం సహకరించడం లేదట. ప్రస్తుతానికి అయితే ఆమె హోప్స్‌ వదిలేసుకుంది. ఈ రూపంతోనే నటన కొనసాగిస్తోంది.
సింగం 3 చిత్రంలో అనుష్కని గ్లామరస్‌గా చూపించడానికి నానా తంటాలు పడ్డారు. నడుముని కప్పి వుంచే దుస్తులతో డిజైనర్లు, లాంగ్‌ షాట్స్‌తో సినిమాటోగ్రాఫర్లు అనుష్కని వీలయినంత స్లిమ్‌గా చూపించేందుకు చూసారు. అలాగే 'బాహుబలి 2' చిత్రం కోసమైతే అనుష్కని సన్నగా చూపించేందుకు గ్రాఫిక్స్‌ సాయం తీసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే విడుదల చేసిన పోస్టర్‌లో అనుష్క గ్లామర్‌ని చూసి ఆహా అన్నవాళ్లు కంటే ఫోటోషాప్‌ వాడేసారని విమర్శించిన వాళ్లే ఎక్కువ. ఒక టైమ్‌లో ఫిజిక్‌ అంటే అనుష్కదే అనిపించుకున్న హీరోయిన్‌కి ఇప్పుడీ కామెంట్లు భరించడం కష్టమే పాపం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు