సునీల్‌ ఇక వేళ్ళెట్టడం మానేస్తాడా?

సునీల్‌ ఇక వేళ్ళెట్టడం మానేస్తాడా?

హీరోగానే సెటిల్‌ అవ్వాలని డిసైడ్‌ అయిన సునీల్‌కి ఎలాంటి కథలు ఎంచుకోవాలనే విషయంలో క్లారిటీ లోపించింది. హీరో అయినప్పటికీ ప్రేక్షకులు తననుంచి కామెడీనే ఆశిస్తారనే సంగతి విస్మరించాడు.

కమర్షియల్‌ హీరో అయిపోదామంటూ వరుసపెట్టి అలాంటి కథలే ఎంచుకున్నాడు. ఈ క్రమంలో దర్శకులని పని చేయనిచ్చేవాడు కాదని, వాళ్ల పనిలో వేళ్ళు పెట్టి తనకి కావాల్సిన విధంగా అన్నీ మార్చేసుకునేవాడని పుకార్లు వినిపించాయి.

చివరకు దిల్‌ రాజులాంటి నిర్మాత నుంచి కూడా సునీల్‌ విజయం దక్కించుకోలేకపోయాడు. వరుస వైఫల్యాలతో సునీల్‌ ఇక తన పని తాను చేసుకోవాలని డిసైడ్‌ అయ్యాడని, అలాగే తనని ప్రేక్షకులు హీరోగా కంటే కామెడీగానే చూడాలనుకుంటున్నారని తెలుసుకున్నాడని, అంచేత ఇకపై అలాంటి సినిమాలే చేస్తూ, దర్శకులకి ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇవ్వబోతున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మరి సునీల్‌లోని ఈ మార్పు అతడిని హీరోగా మళ్లీ సక్సెస్‌ చేస్తుందా లేదా ఇప్పటికే తన లైఫ్‌లైన్స్‌ అన్నీ వాడేసుకున్నాడా? అతని మలి చిత్రాలు విడుదలయితే కానీ చెప్పలేమది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు