శర్వానంద్‌ వర్సెస్‌ నాని: ఎవరు గొప్ప?

శర్వానంద్‌ వర్సెస్‌ నాని: ఎవరు గొప్ప?

టాప్‌ రేంజ్‌ హీరోలని పక్కన పెడితే మధ్య శ్రేణి హీరోల మధ్య పోటీ ఇప్పుడు తీవ్రంగా వుంది. ఈ టయర్‌లో చాలా మంది హీరోలు పోటీ పడుతూ వుండడంతో ఎవరికి అగ్ర తాంబూలం ఇవ్వాలనేది తెలీడం లేదు. ఈ జోన్‌లో ఇద్దరు హీరోలు మాత్రం కన్సిస్టెంట్‌గా పర్‌ఫార్మ్‌ చేస్తున్నారు. ఒకరు నాని అయితే మరొకరు శర్వానంద్‌. రీచ్‌ పరంగా నాని మార్కెట్‌ శర్వానంద్‌ కంటే ఎక్కువే కానీ 'శతమానం భవతి'తో శర్వానంద్‌ కూడా తన స్థాయి పెంచుకున్నాడు.

ఇద్దరి సినిమాలు మూడు వారాల వ్యవధిలో రిలీజ్‌ అయిన నేపథ్యంలో ఎవరి బలాలేమిటో, ఇద్దరిలో ఎవరిది పైచేయో అనేది విశ్లేషించుకుంటే, 'శతమానం భవతి' పూర్తిగా టీమ్‌ వర్క్‌. అందులో శర్వానంద్‌ ఒక క్యారెక్టరే తప్ప అతని వల్ల సినిమాకి యాడ్‌ అయిందేమీ లేదు. ఆ ప్లేస్‌లో ఎవరున్నా రిజల్ట్‌లో అంత మార్పు వుండేది కాదు. 'నేను లోకల్‌' విషయానికి వస్తే సర్వం నానినే. నాని లేకపోతే ఈ సినిమా లేదని అంతా కితాబిస్తున్నారు. ఏ హీరో స్టామినా అయినా తెలిసేది అతని సినిమాకి వచ్చిన తొలి రోజు కలక్షన్లతోనే.

శతమానం భవతి తొలి రోజు వసూళ్లు మూడు కోట్ల స్థాయిలో వస్తే, నేను లోకల్‌ నాలుగున్నర కోట్లకి పైగా తెలుగు రాష్ట్రాల్లో ఆర్జించింది. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పరంగా కూడా నాని ఎక్కడో వున్నాడు. నేను లోకల్‌ సినిమాకి ఇరవై కోట్ల బిజినెస్‌ జరిగితే, శతమానం భవతికి అందులో సగం కూడా రాలేదు. సో ప్రస్తుతానికి ఈ ఇద్దరిలో నానినే టాప్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు