చరణ్‌ బౌన్స్‌బ్యాక్‌తో అల్లు అర్జున్‌ అలర్ట్‌

చరణ్‌ బౌన్స్‌బ్యాక్‌తో అల్లు అర్జున్‌ అలర్ట్‌

రామ్‌ చరణ్‌ ధృవ సక్సెస్‌తో మళ్లీ ట్రాక్‌ మీదకి రావడమే కాకుండా, తన రూట్‌ మార్చి ఇంతకాలం తనపై వున్న రొటీన్‌ ముద్ర చెరిపేసుకున్నాడు. సుకుమార్‌ సినిమా మొదలు పెట్టి వైవిధ్యభరితంగా ప్రయత్నించడానికి బెదరను అని చరణ్‌ ప్రూవ్‌ చేసాడు. నటుడిగా ట్రాక్‌ మీదకి వచ్చేసిన చరణ్‌ మరోవైపు నిర్మాతగాను సత్తా చాటుకున్నాడు.

చిరంజీవి రీలాంఛ్‌లో చరణ్‌ తీసుకున్న జాగ్రత్తలు, ఆ ప్లానింగ్‌ చూసి ఫాన్స్‌ ఫిదా అయిపోయారు. చిరంజీవి కమ్‌ బ్యాక్‌ అసాధ్యమిక అంటూ ఫాన్సే హోప్స్‌ వదిలేసుకోగా, చరణ్‌ దానిని సుసాధ్యం చేసి చూపించాడు. అలా ఫాన్స్‌కి ఒక్కసారిగా చరణ్‌ హీరో అయిపోయాడు. బ్రూస్‌లీ ఫ్లాప్‌ తర్వాత చరణ్‌ మీద ఫాన్స్‌లోను హోప్స్‌ పడిపోతూ వచ్చాయి. అల్లు అర్జున్‌ రైజ్‌ అవడం, చరణ్‌ గ్రాఫ్‌ పడిపోవడం ఒకేసారి జరగడంతో ఇక చిరంజీవిగారబ్బాయి పుంజుకోవడం కష్టమనే అనుకున్నారు.

కానీ సరైన ఆలోచనలు, ప్రణాళికాబద్ధమైన ప్లానింగ్‌ వుంటే బౌన్స్‌బ్యాక్‌ కష్టమేం కాదని చరణ్‌ నమ్మాడు. దానిని ఆచరణలో పెట్టాడు. చరణ్‌ ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అవడంతో అల్లు అర్జున్‌ అలర్ట్‌ అయ్యాడు. చరణ్‌ ఫోర్స్‌గా మారితే ముందుగా నష్టపోయేది బన్నీనే కనుక వెంటనే ఫాన్స్‌తో ఇంటరాక్ట్‌ అవడం పెంచాడు. తనకి దొరికిన గ్రిప్‌ లూజ్‌ అవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చరణ్‌కి అప్పర్‌ హ్యాండ్‌ రాకుండా చూసుకోవడానికి బన్నీ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంత క్లోజ్‌ కజిన్స్‌ అయినా కానీ హీరోలుగా ఇద్దరి మధ్య పోటీ అయితే వుంది కనుక ఆమాత్రం అలర్ట్‌ అవడం, ఎవరి స్ట్రాటజీ వాళ్లు ఫాలో అవడం తప్పుకాదులెండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు