పవన్‌ రిజెక్ట్‌ చేసిన వాటితో రెండు దించాడు

పవన్‌ రిజెక్ట్‌ చేసిన వాటితో రెండు దించాడు

పవన్‌కళ్యాణ్‌తో రెండేళ్లు జర్నీ చేసిన తర్వాత కూడా అతడిని మెప్పించలేకపోయాడు సంపత్‌ నంది. ఆ టైమ్‌లో పవన్‌ కోసమని అతను రాసుకున్న రెండు కథలు రిజెక్ట్‌ అయ్యాయి. సంపత్‌ తనకి నచ్చే కథ తీసుకు రావడం లేదని, పవన్‌ తనే కథ రాసుకున్నాడు. అదే సర్దార్‌ గబ్బర్‌సింగ్‌. పవన్‌ రాసిన కథని ఒక షేప్‌కి తీసుకురావడంలోను సంపత్‌ విఫలమయ్యాడు. దాంతో దర్శకుడిగాను అవకాశం కోల్పోయాడు.

పవన్‌ అలా ఒక్కసారిగా తీసి పారేయడంతో సంపత్‌ నంది స్ట్రగుల్‌ అవుతాడని అనుకున్నారు కానీ వెంటనే రవితేజని మెప్పించి సినిమా తీసాడు. అదే బెంగాల్‌ టైగర్‌. పవన్‌కళ్యాణ్‌ కోసం సంపత్‌ ముందుగా రాసుకున్న స్టోరీ అదే. బెంగాల్‌ టైగర్‌ యావరేజ్‌గా ఆడిన తర్వాత 'రచ్చ' దర్శకుడు సంపత్‌ వెళ్లి గోపీచంద్‌ని కలిసి ఓ కథ చెప్పి అతడితోను గ్రీన్‌ సిగ్నల్‌ పొందాడు. అదే గౌతమ్‌ నంద. ఇది కూడా పవన్‌ కోసం సంపత్‌ రాసుకున్న కథే. పవన్‌ దగ్గర రిజెక్ట్‌ అయిన కథలు రెండూ వేరే హీరోలతో ఇట్టే ఓకే అయిపోయాయి.

సో పవన్‌ దగ్గర సంపత్‌ టైమ్‌ ఏమీ వేస్ట్‌ అవ్వలేదన్నమాట. ఆ టైమ్‌లో రాసుకున్న కథలతోనే వరుసగా రెండు సినిమాలు దించేసాడు. బెంగాల్‌ టైగర్‌ అంతంత మాత్రంగా ఆడగా, గౌతమ్‌నంద ఎలాంటి ఫలితాన్నిస్తుందో, అసలు పవన్‌ దీనిని ఎందుకు రిజెక్ట్‌ చేసాడో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English