వ‌ర్మ ట్వీట్ల‌ను చూసి చిరు ఫ్యామిలీ ఏం చేస్తుందో తెలుసా...?

వ‌ర్మ ట్వీట్ల‌ను చూసి చిరు ఫ్యామిలీ ఏం చేస్తుందో తెలుసా...?

నిత్యం వివాదాల‌కు కేంద్రంగా ఉండే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ లో ఎంత‌గా చెల‌రేగుతారో తెలిసిందే. ముఖ్యంగా మెగా హీరోలపై వర్మ ట్వీట్స్ ఇటీవ‌ల కాలంలో సంచ‌ల‌నం రేపాయి. చిరు ఫ్యామిలీపై వ‌ర్మ వేస్తున్న ట్వీట్లు ఏదో ఒక వివాదం తెస్తూనే ఉంది. గ‌తంలో వ‌ర్మ కామెంట్స్‌పై మెగా హీరోలు స్పందించారు. అది మాట‌ల యుద్ధానికీ దారితీసింది. అయితే.. తాజాగా చిరంజీవి కూతురు సుశ్మిత కూడా వర్మ ట్వీట్స్ పై స్పందించింది. వ‌ర్మ ట్వీట్ల‌ను చూసి తాము ఏం చేస్తామో కూడా చెప్పింది.

వ‌ర్మ ట్వీట్లు ‘లంచ్ బ్రేక్ లో మాట్లాడుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రావు. ఖాళీ సమయంలో అవి చూసి నవ్వుకుంటాము అని చెబుతోంది. ఒకరి మాటలను మనం నియంత్రంచలేం కదా అని వేదాంతం చెప్పిన సుశ్మిత ‘ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉన్నా.. పూర్తిగా నెగిటివ్ గా మాట్లాడేవారిని సోషల్ మీడియానుంచి బ్లాక్ చేయాలి’ అని తేల్చేసింది.

మొత్తానికి చిరు, ప‌వ‌న్, నాగ‌బాబు... చివ‌ర‌కు సుష్మిత కూడా స్పందించారంటే వాళ్లు న‌వ్వుకునే ప‌రిస్థితుల్లో లేర‌ని.. పైకి అలా చెబుతున్నా వ‌ర్మ ట్వీట్లు వాళ్ల‌ను చికాకు పెడుతున్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి... సుశ్మిత తాజా వ్యాఖ్య‌ల‌కు వ‌ర్మ ఎలా స్పందిస్తారో.. ఆమెకు ఎలాంటి కౌంట‌ర్ వేస్తారో చూడాలి. ప‌వ‌న్ ట్వీట్ల‌కు రెస్పాండ్ అయి ఆయ‌న మూడు వివాహాల గురించి కామెంట్లు చేసిన వ‌ర్మ ఇప్పుడు సుశ్మిత గ‌తాన్ని కూడా తవ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు