చిరంజీవిని దాటేసిన ఎన్టీఆర్

చిరంజీవిని దాటేసిన ఎన్టీఆర్

సినిమాల్లో పాట‌లు, డ్యాన్సులు ఎంత కీల‌క‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే, పాట‌ల‌కు అనుగుణంగా అద్భుతంగా న‌ర్తించే హీరోలు కొంద‌రు మాత్ర‌మే. కొంద‌రు న‌ట‌న‌లో ఎంత‌గా ఇర‌గ‌దీసినా డ్యాన్సుల‌కు వ‌చ్చేస‌రికి మాత్రం హ్యాండ్స‌ప్ పొజిష‌నే. అప్ప‌ట్లో ఏఎన్నార్ స్టెప్పులు పాపుల‌ర్ అయితే త‌రువాత కాలంలో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌న డ్యాన్సుల‌తో అభిమానుల‌ను ఉర్రూత‌లూగించాడు. మ‌న చిరంజీవి కూడా త‌న డ్యాన్సుల‌తో ఆలిండియా ఫేం సాధించేశాడు. ప్ర‌స్తుత త‌రానికి వ‌స్తే డ్యాన్సులు బాగా చేసే హీరోలు చాలామందే ఉన్నారు. అయితే, అంద‌రిలో ఎవ‌రు గొప్ప డ్యాన్స‌ర్ అనే స‌రికి మాత్రం ఒక్కొక్క‌రిది ఒక్కో అభిప్రాయం. కానీ... దీనిపై క‌చ్చితంగా ప్ర‌జాభిప్రాయాన్ని ప‌ట్టుకున్న‌ది మాత్రం ఇంత‌వ‌ర‌కు లేదు. తాజాగా నిర్వ‌హించిన ఓ పోల్ లో మాత్రం మ‌న జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇండియాలోనే బెస్టు డాన్సింగ్ హీరో అని తేలింది.


దేశంలోని సినీ న‌టుల‌లో బెస్ట్ డ్యాన్సర్ ఎవ‌రు అనే దానిపై పోల్ నిర్వ‌హిస్తే టాలీవుడ్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిచాడు. బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని ఓ సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో 22 శాతం ఓట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఎన్టీఆర్ నిలవగా.. 13 శాతం ఓట్లతో సెకండ్ ర్యాంక్ ను బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సొంతం చేసుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు 11 శాతం ఓట్లతో మూడో ర్యాంక్ దక్కడం విశేషం. 

ఇక డ్యాన్సు మాస్ట‌ర్లు కూడా ఈ స్టార్ల కంటే వెనుక‌బ‌డిపోయారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాను 4వ ర్యాంక్ లోను.. లారెన్స్ 5వ ర్యాంక్ లోను నిలిచారు. మాధురి దీక్షిత్ ఆరో స్థానంలో నిలవగా.. ఐశ్వర్యారాయ్ 9వ ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఈ లిస్ట్ లో రామ్ చరణ్ 17వ స్థానంలో నిలిచాడు. బ్రేక్ డ్యాన్సుల‌కు పేరొంది.. ప‌దేళ్ల త‌ర్వాత ఖైదీ నెంబ‌ర్ 150లో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఈ లిస్టులో 10 స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు