బాలయ్య, నాని తరువాత నువ్వే బాసు

బాలయ్య, నాని తరువాత నువ్వే బాసు

ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు విడుదలవడం అరుదైన విషయం. ఈ అరుదైన దృశ్యం తమిళనాడులో చోటు చేసుకోబోతోంది. రాఘవ లారెన్స్ కొత్త సినిమాలు రెండు ఒకే తేదీన విడుదల కానున్నాయి.

సీనయిర్ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వంలో లారెన్స్ నటించిన ‘శివ లింగ’తో పాటు సాయి రమణి డైరెక్షన్లో అతను కథానాయకుడి పాత్ర పోషించిన ‘మొట్ట శివ కెట్ట శివ’ కూడా ఒకే రోజు.. అంటే ఫిబ్రవరి 17న రిలీజవనున్నాయి. ఇద్దరు నిర్మాతల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం.. ఎవరికి వారు పట్టుదలతో ఉండటం.. ఎవరూ తగ్గకపోవడంతో ఫిబ్రవరి 17నే రెండు సినిమాలూ రిలీజయ్యేలా ఉన్నాయి. ఈ విషయంలో లారెన్స్ కూడా ఏమీ చేయలేకపోతున్నాడు.

నిజానికి ఈ రెండు సినిమాల్లో ముందు పూర్తయింది ‘మొట్ట శివ కెట్ట శివ’నే. ఇది తెలుగు బ్లాక్ బస్టర్ ‘పటాస్’కు రీమేక్. ఐతే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ లోపు లారెన్స్ ‘శివలింగ’ చేశాడు. అది కన్నడ సూపర్ హిట్ ‘శివలింగ’కు రీమేక్. చకచకా ఆ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. ఆ సినిమానే ముందు ఫిబ్రవరి 17కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఆ తర్వాత ‘మొట్ట శివ కెట్ట శివ’ను కూడా అదే రోజు రిలీజ్ చేస్తామంటూ నిర్మాత ఆర్.బి.చౌదరి లైన్లోకి వచ్చాడు. మరి ఇప్పుడున్న పట్టుదలతోనే ఇద్దరు నిర్మాతలూ ఉంటారేమో చూడాలి. తెలుగులో ఒకప్పుడు బాలయ్య సినిమాలు ‘బంగారు బుల్లోడు’, ‘నిప్పురవ్వ’ ఒకే రోజు విడుదలయ్యాయి. రెండేళ్ల కిందట నాని సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘జెండాపై కపిరాజు’ కూడా ఒకే తేదీలో రిలీజయ్యాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు