అరవింద్‌ ఈసారి దొరికేసినట్టున్నాడు

అరవింద్‌ ఈసారి దొరికేసినట్టున్నాడు

రామ్‌ చరణ్‌కి మేకోవర్‌ ఇచ్చి అతడిని మళ్లీ రేసులో నిలబెట్టిన ధృవ ఓ తమిళ చిత్రానికి రీమేక్‌ అనే సంగతి తెలిసిందే. తమిళంలో జయం రవి, అరవింద్‌ స్వామి కలిసి చేసిన మ్యాజిక్‌తో థని ఒరువన్‌ బ్రహ్మాండమైన హిట్టయింది. దీంతో ఆ కాంబినేషన్‌ని క్యాష్‌ చేసుకోవడానికి ఇంకో సినిమా తీసారు. అయితే ఈసారి థని ఒరువన్‌లాంటి థ్రిల్లర్‌ కాకుండా ఒక కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

వీరికి తోడుగా హన్సిక నటించిన ఆ చిత్రం పేరు బోగన్‌. ఇనీషియల్‌ రియాక్షన్స్‌, రివ్యూస్‌ చూస్తోంటే థని ఒరువన్‌ డుయో ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేయలేదనే అనిపిస్తోంది. సినిమా సరదాగానే వుంది కానీ వావ్‌ ఫ్యాక్టర్‌ లేదని పెదవి విరుస్తున్నారు. కాలక్షేపం కోసం చూడవచ్చును తప్ప తప్పక చూసే సినిమా కాదని విమర్శకులు తేల్చేస్తున్నారు. అసలే జయం రవి, అరవింద్‌ స్వామి వున్నారనగానే థని ఒరువన్‌ని దృష్టిలో పెట్టుకుని ఆడియన్స్‌ హై రేంజ్‌ ఎక్స్‌పెక్టేషన్లతో దిగిపోతారు.

మరి వారిని శాటిస్‌ఫై చేయాలంటే ఈ యావరేజ్‌ సినిమా సరిపోతుందో లేదో? వీళ్లిద్దరి కాంబినేషన్‌ అనేసరికి రీమేక్‌ రైట్స్‌ కోసం చాలా మంది నిర్మాతలు యమ ఆసక్తిగా ఎదురు చూసారు. ఇప్పుడిక ఎవరి దారి వారు చూసుకుంటారేమో. మహా అయితే అరవింద్‌ పేరు చెప్పి అనువాదం కావచ్చు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు