రామ్‌ చరణ్‌ ఓవరాక్షన్‌

రామ్‌ చరణ్‌ ఓవరాక్షన్‌

చిరంజీవి రీఎంట్రీ చిత్రాన్ని పర్‌ఫెక్ట్‌గా ప్లాన్‌ చేయడంలో, ఆ చిత్రానికి పబ్లిసిటీ అదరగొట్టడంలో, ఖైదీ నంబర్‌ 150 మాగ్జిమమ్‌ ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయడంలో నిర్మాతగా రామ్‌ చరణ్‌ పాత్ర చాలా వుందనేది కాదనలేని నిజం. ఈ చిత్రానికి మంచి ప్లానింగ్‌తో నిర్మాతగా ప్రూవ్‌ చేసుకున్న చరణ్‌ లాభాలు కూడా భారీగానే వెనకేసుకున్నాడు. దీంతో చిరు రీఎంట్రీలో రెండవ చిత్రాన్ని కూడా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ మీదే చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు.

తమ బ్యానర్లో సినిమా చేసుకోవడమనేది చిరంజీవికి కంఫర్ట్‌. భారీ బడ్జెట్‌ చిత్రం కనుక, తన ఏజ్‌ కూడా పెరిగింది కనుక తనకి వీలయినట్టుగా షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేసుకోవడానికి సౌలభ్యం వుంటుంది. అంచేత చిరంజీవి ఈ చిత్రాన్ని కూడా సొంత బ్యానర్లోనే చేస్తున్నారని అనుకోవచ్చు. అయితే ఏదో బయటి నిర్మాతకి చిరంజీవి వరుసగా రెండో సినిమా ఇచ్చినట్టుగా చరణ్‌ తెగ ఎక్సయిట్‌ అయిపోతున్నాడు.

ఇది తన అదృష్టమని, నాన్నగారు తనపై వుంచిన నమ్మకం పెద్ద గౌరవంగా భావిస్తున్నానని చరణ్‌ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. సొంత బ్యానర్లో సినిమా తీసుకుంటూ ఇలాంటి స్టేట్‌మెంట్స్‌ ఏంటి కామెడీగా అంటూ యాంటీ ఫాన్స్‌ చరణ్‌ ఓవరాక్షన్‌ చేస్తున్నాడని కామెంట్‌ చేస్తున్నారు. వాళ్ల రియాక్షన్‌ కొంచెం ఓవర్‌గా ఉన్నా, చరణ్‌ స్టేట్‌మెంట్‌ కూడా కాస్త అతిగానే ఉన్నట్టుంది మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు