చిరు.. పవన్ కాంబినేషన్ ఎలా సెట్ అయిందబ్బా!

చిరు.. పవన్ కాంబినేషన్ ఎలా సెట్ అయిందబ్బా!

ఇలాంటి కాంబినేషన్ వుంటుందా అనుకునే టైంలో... పారిశ్రామిక వేత్త.. నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి సెట్ చేసేశాడు. ఇటీవల ‘ఖైదీ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు... బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించాడో అందరికీ తెలిసిందే. దాంతో టి.సుబ్బిరామిరెడ్డి.. చిరంజీవితో పాటు నిర్మాతలైన చిరంజీవి సతీమణి సురేఖ.. చిరు తనయుడు రామ్ చరణ్ ను పార్క్ హయ్యత్ లో ఘనంగా సన్మానించారు. ఆ సందర్భంగా చిరుతో సినిమా చేస్తానని చెప్పాడో లేదో తెలియదు కానీ... ఈ రోజు అయితే అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు.

అది కూడా ఆషామాషీ కాంబినేషన్ కాదు.. క్రేజ్ లో పీక్ స్టేజ్ లో వున్న పవన్ కళ్యాణ్... మెగాస్టార్ చిరుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాను తీయబోతున్నట్టు ప్రకటించేశాడు. అంతేనా... దానికి దర్శకత్వం కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే చిరంజీవితో స్టేట్ రౌడీ చిత్రాన్ని నిర్మించిన టి.సుబ్బిరామిరెడ్డి.. ఇప్పుడు ఇలా మెగాస్టార్.. పవర్ స్టార్.. కాంబినేషన్ ను సెట్ చేయడంతో ఇంటస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ప్రస్తుతం ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లేదీ చెప్పలేదు కానీ... ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాతో బిజీ. ఆ తరువాత ‘వేదాలం’ రీమేక్ చేయనున్నాడు. అలానే చిరంజీవి కూడా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమాను.. బోయపాటితో మరో సినిమాను చేయడానికి రెడీగా వున్నారు. ఇలోగా త్రివిక్రమ్ మహేష్.. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాల్సి వుంది. పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. మరి ఈ అన్నదమ్ములిద్దరినీ కలిపి ఎప్పుడు.. ఏ సంవత్సరంలో డైరెక్షన్ చేయనున్నాడో నిర్మాత ప్రకటిస్తే గానీ అసలు విషయం తెలియదు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు