రష్మీకి అతనితో సంబంధముందా?

రష్మీకి అతనితో సంబంధముందా?

జబర్దస్త్‌ యాంకర్‌ ప్లస్‌ గుంటూర్‌ టాకీస్‌ ఫేమ్‌ రష్మీ గౌతమ్‌కి 'జబర్దస్త్‌'తో పేరు తెచ్చుకున్న కమెడియన్‌ 'సుడిగాలి' సుధీర్‌తో అఫైర్‌ ఉన్నట్టు చాలాకాలంగా గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. దీని గురించి రష్మిని అడిగితే ఖండించకుండా, కన్‌ఫర్మ్‌ చేయకుండా కన్‌ఫ్యూజింగ్‌ ఆన్సర్‌ ఒకటి ఇచ్చింది.

అఫైర్‌ లేదని చెప్పినంత మాత్రాన నమ్మేయరు కదా, ఎవరికి కావాల్సింది వాళ్లు మాట్లాడుకుంటూ, రాసుకుంటూనే వుంటారు కదా, ఇక అప్పుడు ఉందనో, లేదనో ఎందుకు చెప్పడమంటూ రష్మి ఆన్సర్‌ ఇవ్వడంతో సుధీర్‌తో ఆమె అఫైర్‌పై క్వశ్చన్‌ మార్క్‌ అలా వుండిపోయింది. దీనికి క్లారిటీ ఇస్తూ సుధీర్‌ ఓ ఇంటర్వ్యూలో రష్మితో తనకి ఎలాంటి రిలేషన్‌ లేదని తేల్చేసాడు. కేవలం స్కిట్‌లో ఫన్‌ కోసం రష్మితో తనని లింక్‌ అప్‌ చేస్తుంటారని, అలాగే తనకి అమ్మాయిల పిచ్చి వున్నట్టుగా స్కిట్‌లు రాస్తుంటారని, దీంతో నిజంగానే తన క్యారెక్టర్‌ బ్యాడ్‌ అనే ప్రచారం జరిగిపోయి ఎవరూ పిల్లని కూడా ఇవ్వడం లేదని సుధీర్‌ చెప్పాడు.

కేవలం కామెడీ కోసం వాడిన డైలాగులని పట్టుకుని రష్మితో అఫైర్‌ అంటగట్టేసారని అన్నాడు. తనది లవ్‌ ఫెయిల్యూర్‌ అని, పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తరచుగా బ్రేక్‌ తీసుకుని రెండు రోజులు ఎక్కడికి అయినా వెళ్లి ఎంజాయ్‌ చేసి వస్తుంటానని చెప్పాడు. అయితే సుధీర్‌ ఈ విషయాలని రివీల్‌ చేయడం అతని జబర్దస్త్‌ దోస్తులకి నచ్చలేదు. దీని వల్ల అతని క్యారెక్టర్‌పై మరిన్ని అనుమానాలొస్తాయని వారించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు