బాహుబలి లేకుండా కొట్టగలడా?

బాహుబలి లేకుండా కొట్టగలడా?

దగ్గుబాటి రాణా హీరోగా పరిచయమై చాలా ఏళ్లవుతోంది కానీ ఇంతవరకు సోలో హీరోగా అతను సాధించిన ఘన విజయాలేమీ లేవు. అతనికి అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన బాహుబలి తప్ప చెప్పుకోవడానికి రాణాకంటూ ప్రొఫైల్‌ ఏమీ లేదు.

ఇండస్ట్రీ హిట్‌ సినిమాలో నటించాడనే పేరే కానీ రాజమౌళి పేరు లేకుండా, బాహుబలి బ్రాండింగ్‌ లేకుండా రాణా ఇంకా సేల్‌ అవడం లేదు. బాహుబలి తర్వాత కూడా రాణా సినిమాలకి గిరాకీ లేకపోవడమే దీనిని నిరూపిస్తుంది. బాహుబలి కాకుండా తాను ఇండివిడ్యువల్‌గా కూడా జనాన్ని రాబట్టగలనని రాణా నిరూపించుకోవాల్సిన టైమొచ్చింది. అతను నటించిన 'ఘాజీ' చిత్రానికి ప్రోమోస్‌తోనే మంచి బజ్‌ వచ్చింది. సినిమా మెటీరియల్‌ ఇంట్రెస్టింగ్‌గా వుండడంతో ఇది జనాల దృష్టిలో పడింది.

ఈ నెలలోనే విడుదల కానున్న ఈ చిత్రంతో రాణా సత్తా ఏంటనేది తెలుస్తుంది. బాహుబలి తర్వాత తన కెరియర్‌ ఊపందుకుంటుందని చూస్తోన్న రాణాకి అది జరిగే పనో కాదో అనేది ఘాజీతో తేలిపోతుంది. అసలే సోలోగా తేజ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాతో తన స్టార్‌ మారిపోతుందనే ఆశలతో వున్నాడు కనుక దానికి ముందు అతనికీ కాన్ఫిడెన్స్‌ అవసరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు