పవన్‌ అందరివాడు, అన్నయ్యకి తప్ప!

పవన్‌ అందరివాడు, అన్నయ్యకి తప్ప!

పవన్‌కళ్యాణ్‌కి ఏదైనా నచ్చితే దానిని అభినందించడంలో ముందుంటాడు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రాన్ని కాస్త ఆలస్యంగా చూసిన పవన్‌కళ్యాణ్‌కి ఆ సినిమా బాగా నచ్చిందట. దాంతో శ్రీనివాసరెడ్డికి అభినందనలతో బొకే పంపించాడు. తన సినిమాలే తాను చూసుకోని పవన్‌కళ్యాణ్‌ తీరిక చేసుకుని మరీ ఒక సినిమాని చూసి, దానికి అభినందనలు అందించాడంటే అది గొప్ప విషయమే.

పవన్‌ చేసింది మంచి పనే అయినా కానీ చిరంజీవి అభిమానులకి మాత్రం మరోసారి పవన్‌ మీద కోపం వచ్చింది. అందరి సినిమాలకీ అభినందనలు తెలిపే పవన్‌ 'ఖైదీ నంబర్‌ 150'కి మాత్రం చిరంజీవిని కలిసి బొకే ఎందుకు ఇవ్వలేదంటూ మండి పడుతున్నారు. బ్రూస్‌లీతో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చినపుడు పవన్‌ స్వయంగా వెళ్లి కలిసి బొకే ఇచ్చి అన్నయ్యని ఇండస్ట్రీకి తిరిగి స్వాగతించాడు.

అది కూడా చరణ్‌ బలవంతం మీద చేసాడంటూ అప్పట్లో పుకార్లు వినిపించాయి. ఖైదీ నంబర్‌ 150 విషయంలో మొదట్నుంచీ స్పందించని పవన్‌ వేరే సినిమాల ఆడియో వేడుకలకి వెళ్లడం, ఇలా చిన్న సినిమాలకి అభినందనలు అందజేయడం మెగాస్టార్‌ అభిమానులకి అస్సలు నచ్చట్లేదు. పవన్‌ అందరికీ కావాల్సినవాడే కానీ అన్నయ్య మాత్రం తనకి అక్కర్లేదని ఫాన్స్‌ గుస్సా అవుతున్నారు. ఫాన్స్‌ అందరినీ ఖుషీ చేసే ఆ మెగా మొమెంట్‌ని పవన్‌ ఎప్పుడు ప్లాన్‌ చేస్తాడో ఏమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు