ఈ'గోల'తో ఎవడు బాగు పడ్డట్టు?

ఈ'గోల'తో ఎవడు బాగు పడ్డట్టు?

ఈగోలకి పోయి ఒకే రోజున రెండు భారీ చిత్రాలు విడుదల చేస్తే ఏమవుతుందో 'రెయీస్‌', 'కాబిల్‌'తో బాలీవుడ్‌కి తెలిసి వచ్చింది. ఒక్క రోజు హాలిడే కలిసి వస్తుందని రెండు పెద్ద సినిమాలని ఒకరిపై ఒకరు పోటీగా రిలీజ్‌ చేసుకున్నారు. రెండిటికీ డీసెంట్‌ టాక్‌ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇంతవరకు రెయీస్‌ 110 కోట్లు, కాబిల్‌ 80 కోట్లు ఇండియాలో వసూలు చేసాయి.

భారీ చిత్రాలు యావరేజ్‌ అయితే ఇండియాలో రెండు వందల కోట్లు వస్తున్నాయిపుడు. కానీ ఈ రెండు చిత్రాలకీ అంత సీన్‌ లేదని తేలిపోయింది. విడిగా వచ్చినట్టయితే షారుక్‌ సినిమా రెండొందల కోట్లు, హృతిక్‌ సినిమా నూట యాభై కోట్లు వసూలు చేసి వుండేవి. కానీ ఒకేసారి రావడంతో ఆడియన్స్‌ డివైడ్‌ అయిపోయి ఒకరి బిజినెస్‌ ఇంకొకరు తినేసారు. ఒకే ఒక్క రోజు హాలిడే కోసం పడిన కక్కుర్తితో మొదటికే మోసం వచ్చింది.

రెండు సినిమాల్లో ఏ ఒక్కటి వెనక్కి తగ్గినా ఇద్దరూ బాగుపడి వుండేవారు. కానీ ఈగో చూపించి ఎవరికి వారు వెనక్కి వెళ్లమంటూ భీష్మించుకున్నారు. ఫైనల్‌గా రెండు సినిమాలూ భస్మమయ్యాయి. ఈ ఎక్స్‌పీరియన్స్‌ నుంచి అయినా మేల్కొని ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటే మంచిది. బాలీవుడ్‌ మార్కెట్‌కి ఒకేసారి రెండు, మూడు సినిమాలు విడుదల చేసి, అందరూ బాగుపడే సీన్‌ లేనే లేదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు